వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శతాబ్ది ఉత్సవాల వేళ.. ఉస్మానియా వర్సిటీకి వందనం అన్న పవన్ కల్యాణ్

శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన పట్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు విద్యాబుద్దులను అందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రణామాలు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

బ్రిటిష్ విద్యావేత్త విల్ప్రెడ్ స్యూయిన్ బ్లంట్ ఆలోచనల్లో ఊపిరిపోసుకుని ఏడో నిజాం నవాబు ఉస్మాన్ మీర్ అలీఖాన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ తల్లి నీడలో చదువుకున్న ఎందరో విద్యార్ధులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, కళాకారులుగా సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు.

pawan-kalyan

అంతే కాకుండా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తీర్చిదిద్దిన ఈ చదువుల తల్లి శత వసంతాల పండుగను నిర్వహించుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.

శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన పట్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జరిగే ఉత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరవుతున్నారు.

English summary
Janasena president Pavan Kalyan salutes Osmania University on its centenary celebrations. In a statement, he said OU has been imparting education to severl lakhs of people. It was found with the plans of British educationist Wilfred Suice Blunt an Seventh Nizam Osman Mir Alikhan constructed it. OU developed several intellectuals, scientists, doctors, engineers and artistes. Several chief ministers, ministers and even prime minister have studied at the OU. I salute to the university on its centenary celebrations, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X