హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు-కెసిఆర్ ముచ్చట్లు: పవన్ కళ్యాణ్ అలా చెప్పాక తొలిసారి, స్పెషల్ అట్రాక్షన్ (ఫోటోలు)

71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన అల్ఫాహార విందుకు ఇరురాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌‌లు హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన అల్ఫాహార విందుకు ఇరురాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌‌లు హాజరయ్యారు.

పవన్ కళ్యాణ్ తొలిసారి

పవన్ కళ్యాణ్ తొలిసారి

ఈ విందుకు హాజరు కావాలని గవర్నర్‌ ప్రత్యేకంగా పవన్‌ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు రాజ్‌భవన్‌లో నిర్వహించిన తేనీటి విందుకు పవన్‌ కళ్యాణ్ తొలిసారి హాజరయ్యారు.

Recommended Video

Pawan Kalyan In Political Dilemma! YS Jagan Or Chandrababu - Oneindia Telugu
పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ

పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణ

ఎట్‌హోంగా పిలిచే ఈ అల్పాహార విందు కార్యక్రమంలో పవన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన అతిర‌థ మ‌హార‌థులంద‌రికీ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ దంప‌తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

చంద్రబాబు-కేసీఆర్ ముచ్చట్లు

చంద్రబాబు-కేసీఆర్ ముచ్చట్లు

ఎట్ హోం కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావులు పక్క పక్కనే కూర్చొని కాసేపు ముచ్చటించుకున్నారు.

చంద్రబాబుతో

చంద్రబాబుతో

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కాసేపు ముచ్చటించారు. చంద్రబాబు, కేసీఆర్, దత్తాత్రేయ, కామినేని శ్రీనివాస రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఒకే వద్ద నిలబడి మాట్లాడుకున్నారు.

కేంద్రమంత్రులు సహా

కేంద్రమంత్రులు సహా

ఈ విందుకు కేంద్ర‌మంత్రులు ద‌త్తాత్రేయ‌, సుజ‌నా చౌద‌రి, త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య, తెరాస ఎంపీలు కేశవరావు, డీఎస్‌, ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ మంత్రులు సీఎం కడియం శ్రీహరి, నాయిని నర్సింహా రెడ్డి, కేటీఆర్‌,ల‌క్ష్మారెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, ఈట‌ెల రాజేంద‌ర్‌ పాల్గొన్నారు.

పుల్లెల గోపీచంద్ హాజరు

పుల్లెల గోపీచంద్ హాజరు

ఇంకా, కాంగ్రెస్ నేత‌లు జానారెడ్డి, ష‌బ్బీర్ అలీ, ఏపీ మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌, బిజెపి నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ మాజీ సీఎస్‌ రాజీవ్‌ శర్మ, తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ బీఎస్‌ రాములు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అక్టోబర్ నుంచి రాజకీయాల్లోకి

అక్టోబర్ నుంచి రాజకీయాల్లోకి

గత ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో బరిలో దిగుతామని ప్రకటించారు. ఇందుకు తగినట్లుగా కార్యకలాపాలు విస్తరిస్తున్నారు. అక్టోబర్ నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్‌కు రాజ్ భవన్ నుంచి ప్రత్యేకంగా మొదటిసారి ఆహ్వానం అందడం గమనార్హం.

English summary
Jana Sena chief and Power Star Pawan Kalyan attended the ‘At Home’ Raj Bhavan Celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X