వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిన్న కేటీఆర్ సూచన.. బ్రాండ్ అంబాసిడర్‌గా సిద్ధమని స్వయంగా పవన్ కళ్యాణ్

'చేనేత'కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత కార్మికులకు ఊతమివ్వాలని ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.

మీరు సిద్ధమా?: నాగ్, మహేష్ బాబు, సానియా, మంచు లక్ష్మీ, సమంతలకు కేటీఆర్, కమల్ స్పందన మీరు సిద్ధమా?: నాగ్, మహేష్ బాబు, సానియా, మంచు లక్ష్మీ, సమంతలకు కేటీఆర్, కమల్ స్పందన

చేనేత కార్మికుల దీనస్థితిపై పవన్ కళ్యాణ్ చలించిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

Pawan Kalyan ready to brand ambassador for handlooms

తెలంగాణ చేనేత అఖిల పక్షం ఐక్య వేదిక, ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాదులోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని కలిశారు.

Pawan Kalyan ready to brand ambassador for handlooms

తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల ఆకలి చావులను ఈ సందర్భంగా పవన్ దృష్టికి తీసుకు వచ్చారు.

వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న 'చేనేత సత్యాగ్రహం' కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. వారి ఆహ్వానానికి అంగీకారం తెలిపారు. చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 'చేనేత'కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని స్వచ్ఛందంగా ప్రకటించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే చేనేత ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలో 45 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంపై పవన్ కలత చెందారు.

Pawan Kalyan ready to brand ambassador for handlooms

కాగా, పదిహేను రోజుల క్రితం మంత్రి కేటీ రామారావు చేనేత వస్త్రాలు ధరించి కార్యాలయానికి వచ్చారు. ప్రతి సోమవారం చేనేత దుస్తుల్లో వస్తానని చెప్పారు. అన్నట్లుగా ఆయన చేనేత వస్త్రాలు ధరించి వచ్చారు. అంతేకాదు, నాగార్జున, కమల్ హాసన్, సానియా మీర్జా, మంచులక్ష్మి, సమంత, మహేష్ బాబులకు కూడా చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు.

English summary
Pawan Kalyan ready to brand ambassador for handlooms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X