వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మురళి హత్యకు పక్కా ప్లాన్: 24 కత్తిపోట్లు, వైద్యులే నివ్వెరపోయారు....

|
Google Oneindia TeluguNews

వరంగల్‌ : హన్మకొండలో గురువారం జరిగిన కార్పొరేటర్‌ అనిశెట్టి మురళి (44) అత్యంత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిందితులు ముగ్గురు పోలీసులకు లొంగిపోగా వరంగల్‌ పోలీసు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం మురళి మృతదేహానికి ఎంజీఎంలో పోస్టుమార్టం చేసిన డాక్టర్లు సైతం నివ్వెరపోయారు.

నిందితు ఏకధాటిగా 24 కత్తి పోట్లకు ప్పాడినట్లు గుర్తించారు. ఇంటిపై అంతస్తులో పెద్ద మనుషుల కళ్లెదుటే ఈ హత్య జరగడం పలు అనుమానాకు తావిస్తోంది. నిందితులు ఊహించనట్టుగానే కళ్లో కారం కొట్టి మురళిని ముందుగా తలపై ఆ తర్వాత గుండె భాగంలో, చేతి మణికట్టు ప్రాంతంలో కాలు చీమండ ప్రాంతాల్లో కత్తుతో నరికి చంపేసినట్లు డాక్టర్లు తెలిపారు.

దీనిపై వరంగల్‌ పోలీసు కమిషనర్‌ జి. సుధీర్‌బాబు ఆదేశా మేరకు పోలీసు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానం ఉన్న వ్యక్తు ఇళ్లలో సోదాలు చేస్తూ విచారిస్తున్నారు.

పుట్టిన రోజే చంపాని స్కెచ్‌...

పుట్టిన రోజే చంపాని స్కెచ్‌...

అధికార పార్టీ కార్పొరేటర్‌ అనిశెట్టి మురళిని పక్కా ప్లాన్‌ ప్రకారమే హ్యత చేసినట్లు తొస్తోంది. ఈ హత్యలో ప్రధాన నిందితుడు బొమ్మతి విక్రం నెల రోజు క్రితం నుంచే పక్కా ప్లాన్‌ వేసినట్టు తెలిసింది. మురళి పుట్టిన రోజు జులై 14వ తేదీ కావడంతో అదే రోజు కోసం కాచుకొని ఉన్నట్టు తెలిసింది.

తప్పకుండా అక్కడికి...

తప్పకుండా అక్కడికి...

మురళి పుట్టిన రోజు తప్పకుండా నగరంలోని సాయిబాబా, సంతోషిమాత, భద్రకాళి దేవాయాలకు దర్శనం కోసం కుటుంబంతో వస్తాడని అప్పుడే చంపాలని ముందుగానే స్కెచ్‌ వేసినట్టు తెలిసింది. కాని ఒక రోజు ముందుగానే రోజంతా వర్షం కురవడం, ఇంటిపై ఓ ఫంక్షన్‌ హాల్‌కు సంబంధించిన వివాదానికి సంబంధించి పంచాయితీ జరుగుతుండడం నిందితులకు కలిసి వచ్చింది. ముందుగా మురళి ఇంటికి వచ్చి చూసిన వ్యక్తి ఇంట్లో ఒక్కడే ఉన్నాడని, ఇప్పుడైతే అంతా లైన్‌ క్లియర్‌గా ఉందని చెప్పడంతో ముగ్గురు వ్యక్తులు బర్త్‌డేకు ఒక రోజు ముందే హత్యకు ప్పాడినట్లు సమాచారం.

ఎన్‌కౌంటర్‌ చేస్తారనే వదంతులు...

ఎన్‌కౌంటర్‌ చేస్తారనే వదంతులు...

మురళిని హత్యచేసిన ముగ్గురు నిందితులు పోలీసులకు అదే రోజు లొంగిపోయారు. కాని మురళి అధికార పార్టీకి చెందిన నేత కావడం ప్రజాప్రతినిధు ఒత్తిడితో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కాని ముగ్గరిని పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నట్లు చెప్పారు. వీరికి ఎవరైన మురళి ప్రత్యర్థులు సహాయం చేశారా ? లేక ముగ్గురే హత్య చేశారా ? అన్న కోణంలో విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులు నేరం చేసినట్టు అంగీకరించారని, నేడో రేపో మీడియాకు చూపించి రిమాండ్‌కు తరలిస్తామని కొందరు పోలీసు అధికాయి వెల్లడించారు.

నిందితు ఫోన్‌ల స్వాధీనం

నిందితు ఫోన్‌ల స్వాధీనం

హత్యచేసిన తర్వాత హన్మకొండ పోలీసు స్టేషన్‌కు చేరుకున్న ముగ్గురు నిందితులు విక్రం, చిరంజీవి, వరుణ్‌ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు హత్యకు ముందు ఎవరికీ ఫోన్‌ చేశారు. వీరు ముగ్గురే హత్య చేశారా? ఇంకా వీరికి తోడుగా ఎవరైనా వచ్చారా? అనే కోణంలో కాల్‌ డేటా తీసి ఆరా తీస్తున్నారు. ఇంకా మురళితో చిరంజీవి మాట్లాడే సమయంలోనే అకస్మాత్తుగా కత్తులు, కారంపొడి ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

నిందితులకు రిమాండ్...

నిందితులకు రిమాండ్...

నగరంలో సంచలనం సృష్టించిన తెరాస పార్టీ కార్పొరేటర్ అనిశెట్టి మురళీ హత్య కేసులో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి శుక్రవారం రిమాండ్‌ విధించిన నేపథ్యంలో పోలీసులు వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు. నేరారోపణ ఎదురొంటున్న బొమ్మతి విక్రం, రేకుల చిరంజీవి, మార్త వరుణ్‌బాబులను రాత్రి హన్మకొండ పోలీసులు జైలుకు తరలించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 120 (బి) (నేరపూరిత కుట్ర), 324 (తీవ్రంగా గాయపర్చటం), 449 (హత మార్చేందుకు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడం), 302 (హత్య)తో పాటు మారణాయుధాల చట్టం సెక్షన్‌ 25 (1) (ఎ), 27 (1) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా రాత్రి ఏడు గంటల సమయంలో పోలీసులు న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లి హాజరుపర్చారు. నిందితులను 15 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించడంతో ముగ్గురిని జైలుకు తరలించారు.

English summary
Warangal corprator Anisetti Murali has been killed with pecca plan by Vikram and others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X