హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోటోల తొలగింపు: 'డిఎస్ ఎప్పటి నుంచో టీఆర్ఎస్ కోవర్ట్' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి, ఇతర పార్టీల్లోకి చేరిన రాజకీయ నేతల ఫొటోలను గాంధీ భవన్‌ నుంచి తొలగించారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా చేసిన డి. శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ, కె. కేశవరావుల ఫొటోలను శనివారం తొలగించారు.

ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఈ నెల 8న టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ను వీడిన కె. కేశవరావు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. ఏపీ నుంచి బొత్స సత్యనారాయణ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

నిజానికి పీసీసీ అధ్యక్షులుగా పని చేసిన నేతల ఫొటోలను గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ భవన్‌లోని మీడియా కాన్ఫరెన్స్‌ హాల్లో పెట్టడం అనవాయితీ వస్తుంది. అలాగే డీఎస్‌, బొత్స, కేకే ఫొటోలను కూడా పెట్టారు. శనివారం ఎంపీ వీహెచ్, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి స్వయంగా ఆ ముగ్గురి ఫొటోలను తొలగించేశారు.

గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వీహెచ్ మాట్లాడుతూ డి. శ్రీనివాస్ ఎప్పటి నుంచో టీఆర్‌ఎస్‌కు కోవర్టుగా పని చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి నేత పార్టీలో ఉండడం ప్రమాదరకమని, ఆయన పార్టీని వీడడం వల్ల నష్టమేమీ లేదని, మంచే జరిగిందన్నారు.

 గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన గాంధీ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. డీఎస్‌ వల్ల ఎప్పుడూ పార్టీ బలోపేతం కాలేదని చెప్పారు.

 గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

బంగారు తెలంగాణ కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెబుతున్నాడని, రాజశేఖర్‌రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోతుంటే అడ్డుకుంటూ పోరాటం చేసిన పీజేఆర్‌ని మంత్రిగా ఉన్న డీఎస్‌ ఎందుకు సమర్థించలేదని ప్రశ్నించారు.

 గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

పైగా బీసీలకు న్యాయం చేసేందుకే టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నానంటున్నారని, అసలు ఆయన ఒక్క బీసీ నేతనైనా ఎదగనిచ్చారా అంటూ నిలదీశారు.

 గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

తనకు పదవులు అక్కర్లేదని, తన చేతుల మీదుగా 294 మందికి బీ-ఫారాలు పంచిపెట్టానని చెప్పుకొంటున్నారని, కానీ ఆయన పంచిపెట్టలేదని బీ-ఫారాలు అమ్ముకున్నారని ఆరోపించారు.

 గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

నిజానికి డీఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎంతో చేసిందని, ఆయన మాత్రం పార్టీకి చేసిందేమీ లేదని విమర్శించారు.

 గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

గాంధీ భవన్ నుంచి పీసీసీ అధ్యక్ష ఫోటోలు తొలగింపు

రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎస్‌ తెలంగాణ కోసం పోరాడలేదని, అలాంటి వ్యక్తి ఇప్పుడు బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని ప్రశ్నించారు.

English summary
Photos of ex PCC chiefs removed from Gandhi Bhavan Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X