వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ హంతకుడు!: తీవ్ర వ్యాఖ్యలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మహబూబ్ నగర్: విద్యుత్‌ కోతలతో ఎండుతున్న పంటలు, చేసిన అప్పులు కళ్ల ముందు కనిపిస్తుంటే దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ రైతు హంతకుడని మండిపడ్డారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చే సమయం కూడా ఆయనకు, ఆయన ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందని శపించారు. రాష్ట్రంలో 323 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, కేసీఆర్‌ సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా, ముదనష్టపు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

2004కు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రైతులు ఆందోళనలు చేస్తే కేసులు పెట్టారని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదే పని చేస్తోందని, చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని పొన్నాల లక్ష్మయ్య సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. సోమవారం మహబూబ్ నగర్‌లో వారు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో వారు కేసీఆర్‌ను ఏకిపారేశారు.

 మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

కేసీఆర్‌ అసమర్థత వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకు ప్రభుత్వం స్పందించకపోతే పూర్తి స్థాయిలో రైతు ఉద్యమం చేపడతామని కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డి హెచ్చరించారు.

 మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

తెలంగాణలో అత్యధికంగా 15 లక్షల విద్యుత్‌ కనెక్షన్లున్నాయని, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2.50 లక్షల కనెక్షన్లున్నాయని చెప్పారు.

 మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో రై తులకు కరెంటు కష్టా లొచ్చాయని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ దుయ్యబట్టారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

కరెంటు విషయంలో ఇద్దరు చంద్రులు విమర్శించుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని, సెంటిమెంట్‌తో మభ్యపెట్టి 2019 ఎన్నికల్లోనూ లబ్ధి పొందేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని, ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని అరుణ హెచ్చరించారు.

 మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

మహబూబ్ నగర్ జిల్లా ధర్నా

కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో డిక్టేటర్‌గా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో వారికి స్థానం లేదని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాలలో ఇద్దరు చంద్రులు అధికారంలోకి రావడం వల్ల కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

English summary
Photos of Telangana State Congress leaders dharna in Mahaboobnagar on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X