హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియా ఆస్పత్రిలో కూలిన పైపెచ్చులు: ఒకరికి గాయాలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి మరోమారు పైకప్పు పెచ్చులూడి చికిత్స పొందుతున్న రోగిపై పడ్డాయి. దీంతో నిద్రలో ఉన్న రోగులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణాపాయం లేకున్నా అప్పటికే కాలు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కాలుపై పడడంతో అతనికి వైద్యులు తిరిగి కట్లు కట్టారు. ఇలా ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో తరచుగా పెచ్చులూడి పడుతుండడంతో ఇన్‌పేషంట్లు ఆందోళన చెందుతున్నారు.

కాటేదాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇబ్రహీం (65) నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కాలు ఫ్రాక్చర్ కావడంతో ఉస్మానియా దవాఖాన వైద్యులు అతనిని ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని పాత భవనం మొదటి అంతస్థులోని ఆర్థోపెడిక్ వార్డులో వైద్య సేవలు అందిస్తున్నారు.

పెచ్చులూడి పడి ఇలా...

పెచ్చులూడి పడి ఇలా...

సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో నిద్రలో ఉన్న ఇబ్రహీంపై పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. దీంతో అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.

భార్యపై కూడా...

భార్యపై కూడా...

అతని భార్యపై కూడా పైకప్పు పెచ్చులు పడడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

మళ్లీ కట్టుకట్టారు..

మళ్లీ కట్టుకట్టారు..

డ్యూటీ డాక్టర్లు ఇబ్రహీం కాలుకు తిరిగి కట్లు వేయడంతో పాటు అతనిని అక్కడి నుంచి మరో బెడ్‌పైకి మార్చారు.

పాత భవనం క్షేమం కాదు..

పాత భవనం క్షేమం కాదు..

ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత భవనంలో వైద్య సేవలు పొందడం క్షేమం కాదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మార్చాలని వినతి..

మార్చాలని వినతి..

అధికారులు స్పందించి దవాఖాన పాత భవనంలోని రోగులను ప్రత్యామ్నాయ భవనాల్లోకి మార్చి సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు

English summary
A patient Ibrahim injured, as ceiling of osmania hospital Orthopedic ward collapsed in Hyderabad of Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X