వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔట్‌లుక్ కథనం: స్మితా సబర్వాల్‌కు ఆర్థిక సాయంపై పిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఔట్‌లుక్ మ్యాగజైన్ కథనం వివాదంలో తెలంగాణ ఐఎఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

స్మిత సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారంలో ఇలా ప్రజాధనాన్ని ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అంటూ అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ రచయిత, సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, స్మిత సబర్వాల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Smitha Sabharwal

ఔట్‌లుక్ మ్యాగజైన్ ఇటీవల ప్రచురించిన ఓ కథనం, కార్టూన్ తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయంటూ స్మిత సబర్వాల్ ఆ మ్యాగజైన్‌పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించారని పిటిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆ పత్రికపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారని చెప్పారు.

స్మితా సబర్వాల్ ఓ హోటల్‌లో పాల్గొన్న ప్రైవేట్ కార్యక్రమం గురించి ఔట్‌లుక్ పత్రిక కథనం, కార్జూన్ ప్రచురించిందని, ఇది ఆమె వ్యక్తిగతమని వ్యవహారమని వత్సల అన్నారు. న్యాయ వివాదంలో గెలిస్తే మంజూరు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని చెప్పిన ప్రభుత్వం, ఓడిపోతే వదులుకుంటున్నట్లు పరోక్షంగా తన ఉత్తర్వుల్లో చెప్పందని అన్నారు.

English summary
Social activist Vacchala Vidyasagar filed PIL seeking the quash the orders issued releasing funds to IAS officer Smitha Sabharwal to fight on Outlook magazine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X