వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాపీ బర్త్‌ డే: కేసీఆర్‌కు మోడీ ఫోన్, ఏం చెప్పారంటే..?, ఫొటోతో కేటీఆర్ ఇలా..

నేడు(ఫిబ్రవరి 17) పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేడు(ఫిబ్రవరి 17) పుట్టినరోజు జరుపుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని సీఎంతో 15 నిమిషాలు మాట్లాడారు కేసీఆర్.

సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని కేసీఆర్‌కు ప్రధాని శుభాశీస్సులు అందజేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు సీఎం కేసీఆర్ మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

Prime Minister Narendra Modi says birthday wishes to Telangana CM K Chandrasekhar Rao.

కేటీఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ ముద్దుబిడ్డ, జననేత, భయమే తెలియని పోరాటయోధుడు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కుమారుడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది' అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేసి కేసీఆర్‌ ఫోటోను పోస్ట్‌ చేశారు.

కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన కుమార్తె, ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాగా, పెద్దమ్మ గుడిలో మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పరిపాలన ఎలా ఉండాలో చెప్పిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

ఇది ఇలా ఉండగా, చైనాలో అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. డీప్యూటీ సీఎం కడియం శ్రీహరి కేక్ కట్ చేశారు. తెలంగాణ భవన్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ భవన్‌లో వేడుకలు: కవిత ట్వీట్ ఇలా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కవిత, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు భారీ కేక్‌ను కట్‌ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం కేసీఆర్‌ ఛాయా చిత్రాల ప్రదర్శనను కవిత ప్రారంభించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేసీఆర్‌ జన్మదిన వేడుకలను తెలంగాణ భవన్‌లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కేసీఆర్‌పై అభిమానంతో ఈ కార్యక్రమం నిర్వహించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌.. అమరవీరుల త్యాగఫలంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్‌ వెంటే ఉన్నారని అన్నారు.

English summary
Prime Minister Narendra Modi says birthday wishes to Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X