వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిచ్చి: పోచారం ఆగ్రహం, బెదిరింపులపై ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రమంత్రి పీయుష్ గోయల్ పైన, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల పైన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం మెడకు చుట్టడం సరికాదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చివాదనలు చేస్తున్నారని మండిపడ్డారు.

1998నుండి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పాలనలో 3900కు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. తమది రైతు పక్ష పాత ప్రభుత్వమన్నారు. కేసీఆర్ ఇప్పటికే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేశారన్నారు. గత పదేళ్లలో ఒక్క చెరువును కూడా కాంగ్రెస్ పార్టీ మరమ్మతు చేయలేదన్నారు.

తమ ప్రభుత్వం 44వేల చెరువులను గుర్తించిందన్నారు. యుద్ధప్రాతిపదికన వాటిని పునరుద్ధరిస్తామన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రాబాబు ఏది చెబితే అది చేస్తున్నారన్నారు. రైతుల కోసం రేపటి నుండి లీటరు పాల పైన రూ.4 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు.

Pocharam clarifies on Telangana TDP leaders allegations

పాల రైతులకు పద్నాలుగేళ్లుగా ప్రభుత్వాలు ఏం చేయలేదన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు 75 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు.

ఆత్మహత్య చేసుకున్ రైతుల వివరాలను సేకరిస్తున్నారమని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చివాదనలు సరికాదన్నారు. తాను సెప్టెంబర్ 16న ఢిల్లీలే కేంద్రమంత్రిని కలిశానని, రైతుల ఇబ్బందులు వివరించారనని చెప్పారు. వ్యవసాయ మంత్రుల సమావేశంలో పాల్గొన్నట్లు చెప్పారు.

స్వచ్ఛందంగా వస్తేనే: ఈటెల

తాము ఎవరిని కూడా బెదిరించి తమ పార్టీలో చేర్చుకోవడం లేదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వేరుగా అన్నారు. ఎవరైనా స్వచ్చంధంగా వస్తేనే పార్టీలోకి తీసుకుంటున్నామని తెలిపారు.

English summary
Minister Pocharam Srinivas Reddy clarifies on Telangana TDP leaders allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X