హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ చిచ్చు: బుద్ధునికి కేటాయించిన స్థలంలో కాకా విగ్రహం(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని టాంక్‌బండ్‌పై అక్టోబర్ 5న ఆవిష్కరించనున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత గుడిసెల వెంకటస్వామి (కాకా) విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని దళిక సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

ఆదివారం నగరంలో సమావేశమైన తెలంగాణ దళిత సంఘాల నేతలు ఢిల్లీలోని పీవీ ఘాట్‌ పక్కన కాకా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా మాట్లాడతూ దళితుల మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారని వారు ఆరోపించారు.

టాంక్‌బండ్‌పై అక్టోబర్ 5న ఆవిష్కరించనున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత గుడిసెల వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని శనివారం ధ్వంసం చేసేందుకు కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు యత్నించారు. బుద్ధునికి కేటాయించిన స్థలంలో వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయడం సమంజసం కాదని నిరసించారు.

వెంకటస్వామి విగ్రహాన్ని వెంటనే తొలగించాలని ఎమ్మార్పీఎస్ నేత యాతాకుల భాస్కర్ నేతృత్వంలోని కార్యకర్తలు టాంక్‌బండ్‌పై ధర్నా నిర్వహించారు. విగ్రహ ధ్వంసానికి యత్నిస్తున్న క్రమంలో పోలీసులు వారిని అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరిలించారు.

కాకా విగ్రహం ధ్వంసానికి యత్నం: పలువురి అరెస్ట్

కాకా విగ్రహం ధ్వంసానికి యత్నం: పలువురి అరెస్ట్

నగరంలోని టాంక్‌బండ్‌పై అక్టోబర్ 5న ఆవిష్కరించనున్న మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత గుడిసెల వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు యత్నించారు.

 కాకా విగ్రహం ధ్వంసానికి యత్నం: పలువురి అరెస్ట్

కాకా విగ్రహం ధ్వంసానికి యత్నం: పలువురి అరెస్ట్

బుద్ధునికి కేటాయించిన స్థలంలో వెంకటస్వామి విగ్రహం ఏర్పాటు చేయడం సమంజసం కాదని నిరసించారు. వెంకటస్వామి విగ్రహాన్ని వెంటనే తొలగించాలని ఎమ్మార్పీఎస్ నేత యాతాకుల భాస్కర్ నేతృత్వంలోని కార్యకర్తలు టాంక్‌బండ్‌పై ధర్నా నిర్వహించారు.

 కాకా విగ్రహం ధ్వంసానికి యత్నం: పలువురి అరెస్ట్

కాకా విగ్రహం ధ్వంసానికి యత్నం: పలువురి అరెస్ట్

విగ్రహ ధ్వంసానికి యత్నిస్తున్న క్రమంలో పోలీసులు వారిని అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తరిలించారు. ఈ క్రమంలో టాంక్‌బండ్‌పై వెంకటస్వామి విగ్రహం ఏర్పాటును వ్యతిరేకించడం సమంజసం కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

కాకా విగ్రహం ధ్వంసానికి యత్నం: పలువురి అరెస్ట్

కాకా విగ్రహం ధ్వంసానికి యత్నం: పలువురి అరెస్ట్

అంబేద్కర్ విగ్రహం పక్కన ఇతర నాయకుల విగ్రహాలుండగా, వెంకటస్వామి విగ్రహం ఉండడాన్ని వ్యతిరేకించడం మంచిపద్ధతి కాదన్నారు. దివంగత నేత కాకా కూడా దళితుడేనని, అంబేద్కర్ ఆశయ సిద్ధికి కృషి చేసినవారేనన్నారు. అలాంటి మహావ్యక్తి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడం తగదన్నారు.

English summary
Police arrested MRPs activists protest against the former union minister G Venkat Swamy statue at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X