వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం, రాజీవ్,శ్రవణ్ కస్టడీ కోరిన పోలీసులు

బ్యూటీషీయన్ శిరీష కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది.హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి .

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది.
హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ఇంకా మిస్టరీ ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.

ఈ రెండు కేసులకు లింకుందనే ప్రచారం నుండి వీరిద్దరి ఆత్మహత్యలు తొలి నుండి అనుమానాస్పదంగానే ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే ఈ కేసులో నలుగురు పాల్గొన్నప్పటికీ ఇద్దరు మాత్రమే సజీవంగా ఉన్నారు. మిగిలిన ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలను మృతుల కుటుంబ సభ్యులు మాత్రం ఏకీభవించడం లేదు. వీరిద్దరి ఆత్మహత్యలు కావని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనతో పోలీసులు ఏకీభవించడం లేదు.

సీసీటీవి పుటేజీ మాయం

సీసీటీవి పుటేజీ మాయం

కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీటీవి పుటేజీ జూన్ 1వ, తేది నుండి కన్పించడం లేదని పోలీసులు గుర్తించారు. ఎస్ ఐ ఆత్మహత్య చేసుకొన్న తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకొనేందుకు గాను పోలీసులు సీసీటివి పుటేజీ కోసం ప్రయత్నించారు. అయితే ఎంతకు సీసీటీవి దృశ్యాలు అందుబాటులో లేకపోవడంతో హర్డ్ డిస్క్ ను హైద్రాబాద్ కు పంపారు. నిపుణుల సహయంతో హార్డ్ డిస్క్ ను పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగుచూస్తాయని పోలీసులు భావించారు. అయితే ఎలాంటి దృశ్యాలు లేవని పోలీసులకు హర్డ్ డిస్క్ ను పరిశీలించిన నిపుణులు తేల్చి చెప్పారు.

ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందా?

ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందా?

ఈ నెల 12వ, తేది రాత్రి కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ కు రాజీవ్ , శ్రవణ్, శిరీష వెళ్ళారు. స్టేషన్ లోనే ఉన్న క్వార్టర్ లోనే వీరు నలుగురు పార్టీ చేసుకొన్నారు. ఈ నెల 13వ, తేది తెల్లవారుజామున ఉదయం 2 .42గంటల వరకు రాజీవ్, శ్రవణ్ , శిరీషలు ప్రభాకర్ రెడ్డి క్వార్టర్ లోనే ఉన్నారు. అయితే శిరీషపై రాత్రి రెండు గంటల తర్వాతే ఎస్ ఐ అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే సీసీ టివి పుటేజీ మాయం కావడం యాధృఛ్చికంగా జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగానే పుటేజీని తొలగించారా అనే అనుమానాలు కూడ లేకపోలేదు.

హర్డ్ డిస్క్ డేటా రికవరీ కోసం పోలీసుల ప్రయత్నాలు

హర్డ్ డిస్క్ డేటా రికవరీ కోసం పోలీసుల ప్రయత్నాలు

హార్డ్ డిస్క్ లో డేటా లేకుండా పోయింది. హర్డ్ డిస్క్ నుండి సీసీ పుటేజీ డిలీట్ చేసి ఉంటారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కాగా, హార్డ్ డిస్క్ డేటాను రికవరీ చేయడం కోసం దర్యాప్తు బృందం ...బెంగుళూరు సాంకేతిక నిపుణుల సహయం తీసుకొంటోంది. ఈ హర్డ్ డిస్క్ లో డేటా రికవరీ అయితేనే అసలు వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలు తెలిసే అవకాశాలున్నాయి.

రాజీవ్,శ్రవణ్ లను కస్టడీ కోరిన పోలీసులు

రాజీవ్,శ్రవణ్ లను కస్టడీ కోరిన పోలీసులు

శిరీష ఆత్మహత్య కేసులో రాజీవ్, శ్రవణ్ లను ఐదురోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. శిరీష కేసులో అనుమానాలను తీర్చుకొనేందుకుగాను పోలీసు కస్టడీ కోరినట్టుగా బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.శిరీష దుస్తులపై రక్తపు మరకలున్నట్టు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా అనే విషయాన్ని తెలుసుకొనేందుకు ఫోరెన్సిక్ నివేదికలో తెలిసే అవకాశం ఉంది.

English summary
Banjara Hills police filed a petition in Nampally court for Rajiv , Sravan custody on Wednesday. Kukunoorpally police station cctv footage missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X