మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నో డౌట్స్: ముక్కోణపు ప్రేమకథ, రాజీవ్‌తో శిరీష చనువు, మధ్యలో టెక్కీ యువతి?

ముక్కోణపు ప్రేమ కథ కారణంగానే శిరీష మృతి చెందిందా? గొడవలో జోక్యం చేసుకున్నందుకు తాను ఇరుక్కుంటానని ఆందోళన చెంది కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసకున్నాడా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముక్కోణపు ప్రేమ కథ కారణంగానే శిరీష మృతి చెందిందా? గొడవలో జోక్యం చేసుకున్నందుకు తాను ఇరుక్కుంటానని ఆందోళన చెంది కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య -చేసకున్నాడా? అంటే ఆ కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

చదవండి: ఎవరీ శిరీష?: భర్తకు అర్ధరాత్రి ఫోన్ కానీ, కేసు పెట్టారని కూతురు కన్నీరుమున్నీరు

రాజీవ్ విషయంలో శిరీషకు, మరో స్నేహితురాలుకు మధ్య గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిరీషను ట్రాప్ చేసి తీసుకు వెళ్లారా? లేక ఒప్పించి తీసుకు వెళ్లి ఏమైనా చేశారా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.

చదవండి: ఒంటిపై గాయాలు.. సన్నని వైరుతో.. శిరీషదీ హత్యేనా?: పోస్టుమార్టం‌లో షాకింగ్

రాజీవ్, మరో యువతి, శిరీషల మధ్య విభేదాలు ఉన్నాయని, వారి విభేదాలను పరిష్కరించుకునేందుకు అందరూ కలిసి కుకునూరుపల్లి వెళ్లారని తెలుస్తోంది. వారు తిరిగి తెల్లవారుజామున మూడు గంటలకు స్టూడియోకు వచ్చారు. మార్గమధ్యలో కూడా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. శిరీషకు సర్దిచెప్పి స్టూడియోకు తీసుకు వచ్చారు. శిరీష అపార్టుమెంటు రెండో అంతస్తులోని స్టూడియోలోకి వెళ్లగా.. శ్రవణ్ కింది నుంచి వెళ్లిపోయాడు. రాజీవ్ కూడా కాసేపటికి స్టూడియోలోకి వెళ్లాడు. అప్పటికే శిరీష చనిపోయిందని అంటున్నారు.

ఏడాదిగా శిరీష, ఆ యువతి మధ్య గొడవలు

ఏడాదిగా శిరీష, ఆ యువతి మధ్య గొడవలు

శిరీష, ఆ యువతి మధ్య దాదాపు ఏడాదిగా గొడవలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్యను తేల్చుకునేందుకు రాజీవ్, మరో యువతి, శిరీష, శ్రవణ్ కుకునూరుపల్లి ఎస్సై వద్దకు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. శిరీష, రాజీవ్‌లకు కామన్ ఫ్రెండ్ అయిన శ్రవణ్‌కు ఎస్సై స్నేహితుడు. అలా రాజీవ్‌కు స్నేహితుడయ్యాడు. దీంతో సమస్యను కొలిక్కి తీసుకు వచ్చేందుకు అక్కడకు వెళ్లి ఉంటారని అంటున్నారు.

రాజీవ్‌కు శిరీషతో, మరో యువతితో పరిచయం ప్రేమగా..?

రాజీవ్‌కు శిరీషతో, మరో యువతితో పరిచయం ప్రేమగా..?

శిరీష భర్త ఓ స్వచ్చంధ సంస్థలో వంట మనిషిగా పని చేస్తున్నారు. శిరీష బ్యూటీషియన్. ఈ క్రమంలో రాజీవ్‌తో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. అప్పటి నుంచి శిరీష అతని వద్ద పని చేస్తోంది. వీరిద్దరి మమధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. రాజీవ్‌కు ఏడాది క్రితం ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్న యువతితో పరిచయమై, ప్రేమగా మారిందని అంటున్నారు. రెండు నెలల క్రితం ఆ యువతికి శిరీష గురించి తెలిసి.. తన ప్రేమకు అడ్డు రావొద్దని శిరీషను హెచ్చరించిందని తెలుస్తోంది. దీనిపై ఇద్దరూ కొద్ది రోజుల క్రితం గొడవపడ్డారట. రాజీవ్ ప్రేయసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. తనకు అన్యాయం చేస్తే ఊరుకోనని శిరీష కూడా రాజీవ్‌పై ఒత్తిడి చేయడంతో అతడు తన బాధను శ్రవణ్‌కు చెప్పాడని తెలుస్తోంది. అప్పుడు ఎస్సై ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పి, శిరీషకు కౌన్సెలింగ్ ఇస్తాడని చెప్పాడని, అందుకే కుకునూరుపల్లి వెళ్లారని అంటున్నారు.

ఎస్సైతో శిరీషకు కూడా పరిచయం ఉందా?

ఎస్సైతో శిరీషకు కూడా పరిచయం ఉందా?

రాజేష్ విషయంలో శిరీష, మరో యువతికి మధ్య గొడవలు చాలా రోజులుగా ఉన్నాయి. కుకునూరుపల్లి వెళ్లి ఎస్సై వద్ద సమస్యను పరిష్కరించుకుందామని చెబితే శిరీష ఎలా వెళ్లారు? అంటే ఆమెకు కూడా ఆయన తెలుసా అనే కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.

శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతిలో ఎన్నో అనుమానాలు

శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి మృతిలో ఎన్నో అనుమానాలు

శిరీష, రాజేష్‌లకు విభేదాలు ఉంటే హైదరాబాదులోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదా అక్కడ సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ వీరు కుకునూరుపల్లి వెళ్లి ఆ ఎస్సై వద్దే సమస్యను ఎందుకు పరిష్కరించుకోవాలనుకున్నారు? శిరీష అక్కడి దాకా ఎందుకు వెళ్లినట్లు? అక్కడ ఏమైనా గొడవ జరిగిందా? శిరీష మృతి విషయం తెలిసి ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. అంటే అక్కడ పంచాయతీ కాకుండా ఇంకేమైనా జరిగిందా? లేకుంటే ఎస్సై ఎందుకు ఆందోళన చెందాడు? ఎస్సై సూసైడ్ నోట్ రాశారని వార్తలు వస్తున్నాయి. అందులో ఏముంది? శిరీష ఆత్మహత్య చేసుకుంటే ఆమె ఒంటిపై గాయాలు ఎందుకు ఉన్నాయి? ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.

ఆమె పని చేసే చోట పరిస్థితులు తెలియవని భర్త

ఆమె పని చేసే చోట పరిస్థితులు తెలియవని భర్త

తన భార్య మృతిపై అనుమానాలు ఉన్నాయనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని శిరీష భర్త మరోసారి చెప్పారు. ఆమె పని చేసే చోట పరిస్థితులు తనకు తెలియవని చెప్పారు. కానీ తన భార్య చనిపోయేంద పిరికిది కాదన్నారు.

పలు అనుమానాలు లేవనెత్తిన శిరీష తల్లి

పలు అనుమానాలు లేవనెత్తిన శిరీష తల్లి

తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని శిరీష తల్లి అన్నారు. అదే సమయంలో ఆమె పలు అనుమానాలు లేవనెత్తారు. ఎవరైనా ఫ్యానుకు ఉరి వేసుకుంటే అది బెండ్ కావాలని, కానీ ఫ్యాన్ బాగానే ఉందని చెప్పారు. తన కూతురు 80 కిలోలు ఉంటుందని, అలాంటప్పుడు ఫ్యాన్ కొంచెం కూడా ఎందుకు వంగిపోలేదని ప్రశ్నించారు. ఎవరు ఉరేసుకున్నా నాలుక బయటకు వస్తుందని, తన కూతురుకు అలా రాలేదని చెప్పారు. అసలు రాజీవ్ ఎవరో తమకు తెలియదని చెప్పారు. చున్నీతో ఉరేసుకుందని చెప్పారని, దానిని కట్ చేసినట్లు చెప్పారని, కానీ ఆ ముక్క ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

శిరీష మృతిపై ఆధారాలు సేకరిస్తున్నామని డిసిపి

శిరీష మృతిపై ఆధారాలు సేకరిస్తున్నామని డిసిపి

శిరీష మృతి కేసులో అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరిస్తున్నామని వెస్ట్ జోన్ డిసిపి తెలిపారు. రాజీవ్, శ్రవణ్‌లను మీడియా ముందు ప్రవేశ పెడతామని ఆయన తెలిపారు. దర్యాఫ్తు అధికారులు సాంకేతిక ఆధారాలు అన్నింటిని తీసుకు వచ్చాక మీడియాతో అన్ని వివరాలు చెబుతామన్నారు.

English summary
Police find connection between beautician Sirisha and Telangana SI's suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X