హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విక్రమ్ గౌడ్ భార్య అబద్దం చెప్పారా?: దర్గా వద్ద అలాంటిదేమి కనిపించలేదు!..

తన భర్త విక్రమ్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిందని శుక్రవారం ఉదయం ఆమె ఇచ్చిన ఫిర్యాదులో తప్పుడు సమాచారం ఉన్నట్లుగా పోలీసులు అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మీద జరిగిన కాల్పుల వ్యవహారంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా విక్రమ్ గౌడ్ భార్య మూల షిఫాలీ చెబుతున్న సమాచారం మీద పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌పై కాల్పులు, ఎన్నో అనుమానాలుమాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌పై కాల్పులు, ఎన్నో అనుమానాలు

తన భర్త విక్రమ్ గౌడ్‌పై హత్యాయత్నం జరిగిందని శుక్రవారం ఉదయం ఆమె ఇచ్చిన ఫిర్యాదులో తప్పుడు సమాచారం ఉన్నట్లుగా పోలీసులు అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం దర్గా వద్ద అన్నదానం చేయాల్సి వున్నందున తాము అర్థరాత్రి 2.30 గంటల సమయంలో నిద్ర లేచామని షిఫాలీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో దర్గా వద్ద మానవ సంచారమే లేదని పోలీసులు గుర్తించారు.

police interrogation on mukesh goud son vikram goud injured in gun firing

ఒకవేళ నిజంగా ఆ సమయంలో అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటే, ముందే ప్రచారం జరిగి వుంటుందని, పేదలు చాలామంది అక్కడికి చేరుకునేవారనేది పోలీసుల అభిప్రాయం. అక్కడున్న దర్గా పర్యవేక్షకులు సైతం అన్నదానంపై తమకెలాంటి సమాచారం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్ లో ఉన్న దర్గా కాకుండా, మరే చోటనైనా అన్నదాన ఏర్పాట్లు చేశారా? అన్న కోణంలోను పోలీసుల విచారణ కొనసాగుతోంది.

మరోవైపు భార్యతో ముఖేశ్‌కు ఉన్న విభేదాలు.. ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందన్న అనుమానాలను బట్టి చూస్తే.. తొలుత పోలీసులు ఆమెనే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ విభేదాల కారణంగా విక్రమ్ గౌడ్ తనంతట తానుగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

English summary
Hyderabad police started investigation on Mukesh Goud son Vikram Goud injured in gun firing case. First they may interrogates Vikram's wife
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X