హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మసాజ్ సెంటర్‌పై దాడి, బ్లూటూత్ సాయంతో పరీక్ష రాస్తూ దొరికాడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనుమతి లేకుండా నడుస్తున్న ఓ మసాజ్‌ సెంటర్‌పై పశ్చిమ మండలం డీసీపీ స్పెషల్‌ పార్టీ బుధవారం రాత్రి దాడి చేసింది. ఓ విటుడితోపాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

సోమాజిగూడ ఓ అపార్ట్‌మెంట్స్‌లోని ఒక ఫ్లాట్‌లో మసాజ్‌ సెంటర్‌ నడుస్తోంది. మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నడుస్తోందన్న సమాచారంతో స్పెషల్‌ పార్టీ పోలీసులు దాడి చేశారు.

విశాఖకు చెందిన శ్రీనివాస్ రావుతోపాటు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస్ రావును రిమాండ్‌కు తరలించగా యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

 Police raid at Massage Parlour

బ్లూటూత్‌ సాయంతో పరీక్ష రాస్తూ..

బ్లూటూత్‌ సాయంతో పరీక్షలు రాస్తూ ఇద్దరు విద్యార్థులు చిక్కారు. షాలిబండకు చెందిన మూసాబీర్‌ అనే బిటెక్‌ విద్యార్థి గురువారం సీబీఐటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో నాలుగో ఏడాది చదువుతున్నాడు. బ్లూటూత్‌ సాయంతో అతడి సోదరుడు మహ్మద్‌ ఫరోజ్‌ బయట నుంచి సమాధానలు చెబుతుండగా లోపల మూసాబీర్‌ పరీక్ష రాస్తున్నాడు. ఇన్విజిలేటర్ల ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసులు వారిని అరెస్టు చేశారు.

ఫరాజ్ అబిడ్స్‌లోని మెథడిస్ట్ కాలేజీలో బీటెక్ 2012లో పూర్తి చేశాడు. అయితే రెండో ఏడాదికి సంబంధించిన సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఆ పరీక్షలు రాసేందుకు గురువారం గండిపేట సీబీఐటీ కళాశాల పరీక్ష కేంద్రానికి హాజరయ్యాడు. ఉ.11.30 గంటలకు ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి తనిఖీ చేయగా బ్లూటూత్ సాయంతో జవాబులు సేకరిస్తున్నట్లు గుర్తించి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. నార్సింగి పీఎస్‌లో అప్పగించారు.

English summary
Police raid at Massage Parlour on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X