వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటో డ్రైవర్ నుండి లంచం తీసుకొంటూ కెమెరాకు అడ్డంగా బుక్కెన్న హైద్రాబాద్ పోలీసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగానే వేతనాలను పెంచింది. వేతనాలు పెంచినా పోలీసులు మాత్రం మాముళ్ళు వసూలు చేయడం మానుకోవడం లేదు. ఆటో డ్రైవర్ల నుండి లంచం డబ్బులు వసూలు చేస్తోన్న ఓ పోలీసు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.డబ్బులు లంచం తీసుకొంటున్న దృశ్యాలు ఈ వీడియో లో స్పష్టంగా కన్పిస్తున్నాయి.

హైద్రాబాద్ కు చెందిన ఓ ట్రాపిక్ కానిస్టేబుల్ ఓ ఆటో డ్రైవర్ నుండి డబ్బులు వసూలు చేశారు.అక్టోబర్ 18వ, తేదిన డ్రవైర్ నుండి ట్రాఫిక్ పోలీసు డబ్బులు వసూలు చేసినట్టు కెమెరాలో రికార్డు అయింది.ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా, పర్మిట్టు లేకుండా నగరంలో ప్రవేశించే ఆటోలకు కొదువే లేదు.మామూళ్ళు పుచ్చుకొంటూ పోలీసులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనేందుకు ఈ వీడియో నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Police received bribe from a auto driver ..viral social media

నగరంలోని ఆటో నగర్ లో ముగ్గురు కుర్రాళ్ళు ట్రాపిక్ పోలీసులకు లంచం ఇచ్చారు. అయితే లంచం ఇచ్చే దృశ్యాలను ఆటో డ్రైవర్లు తమ సెల్ ఫోన్లలో రహాస్యంగా చిత్రీకరించారు. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.దేశంలోనే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు వ్యవస్థ నిలిచిందని పోలీస్ బాస్ లు చెబుతున్న తరుణంలో ఈ వీడియో మచ్చగా నిలిచింది.

సోషల్ మీడియాలో ఈ విడియో ను చూసిన వీక్షకులు పోలీస్ చర్యను నిరసిస్తున్నారు. పోలీస్ ల తీరు మారలేదంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసు శాఖలో సంస్కరణలు తేవాల్సిన అవసనం ఉందంటున్నారు నెటిజన్లు.దొొరికిన వారు కొందరే...దొరకని వారెంత మంది ఉన్నారో మరీ.

English summary
Hyderabad traffic police permit to auto driver illegal for bribe. 2 auto drivers give to a traffic police bribe .This incident happened oct 18,2016, auto drivers recorded secretly bribe incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X