వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ రవాణా ముఠా అరెస్ట్: 5.72 కోట్ల విలువైన గోల్డ్ సీజ్

|
Google Oneindia TeluguNews

నల్గొండ: బంగారం అక్రమంగా తయారు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు, కమర్షియల్ టాక్స్ అధికారులు మంగళశారం ఉదయం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.72 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

నల్గొండ జిల్లా కోదాడ రామపురం చెక్ పోస్టు వద్ద తనిఖీలో బంగారం పట్టుపడ్డట్లు పోలీసులు తెలిపారు. బంగారం తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బంగారం ఏదైనా జువెలరీ దుకాణానికి సంబంధించినదా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద ఉన్న వే బిల్లులను పోలీసులు, అధికారులు పరిశీలిస్తున్నారు.

Police seized Rs. 5.72 crores valuable gold in Nalgonda

నాలుగు దుకాణాల్లో భారీ నగదు చోరీ

మహబూబ్‌నగర్: జిల్లాలోని ఐజ మండలం వెంకటాపురం గ్రామంలో నాలుగు దుకాణాల్లో చోరీ జరిగింది. ఓ దుకాణంలో రూ. 4 లక్షల విలువ చేసే బంగారం, వెండిని దొంగలు అపహరించారు.

మిగితా దుకాణాల్లో చోరీకి గురైన సొత్తను పోలీసులు అంచనా వేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Police seized Rs. 5.72 crores valuable gold in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X