నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలో లేదు: కెసిఆర్‌కు జవదేకర్ పొగడ్తలు, నాకూ తెలుగొచ్చు కానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: హరితహారం వంటి కార్యక్రమం దేశంలో మరే రాష్ట్రంలోను లేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కితాబిచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామంలో నిర్వహించిన హరిత హారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలలో మొక్క నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే పదేళ్లలో రాష్ట్రంలో 33 శాతం మొక్కలు నాటవచ్చన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కెసిఆర్ చేసిన ఉద్యమానికి ప్రజలందరు మద్దతు పలికారన్నారు. తెలంగాణ కోసం బీజేపీ మద్దచ్చిందని గుర్తు చేశారు.

హరిత హారం కార్యక్రమం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ హరితహారాన్ని ఒక ఉద్యమంలా చేపట్టారన్నారు. మొక్కలు నాటడమే కాదు.. చెట్టును కాపాడటం కూడా మన బాధ్యతే అన్నారు. ప్రతీ మొక్కకు ట్రీ గార్డు పెడితేనే చెట్టు బతుకుతుందన్నారు.

హరిత హారం

హరిత హారం

నిజామాబాద్ జిల్లా వేల్పూరులో జరిగిన హరితహారం కార్యక్రమంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొని, ప్రసంగించారు.

హరిత హారం

హరిత హారం

ఆయన మాట్లాడుతూ... వేల్పూరు నుంచి ఉచిత నిర్బంధ విద్యను ప్రారంభిస్తామని ప్రకటించారు. వేల్పురు రైతులకు వందశాతం డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేస్తామన్నారు.

హరిత హారం

హరిత హారం

వందశాతం సబ్సిడీపై 100 పసుపు ప్లాంట్ ఫాంలు నిర్మిస్తామన్నారు. కాళేశ్వరం నుంచి నిజాంసాగర్‌కు నీళ్లు మళ్లిస్తామని తెలిపారు.

హరిత హారం

హరిత హారం

వేల్పూరు గ్రామపంచాయితీ భవనానికి రూ.50 లక్షలు, బాల్కొండ నియోజకవర్గంలోని 7 గ్రామాలకు కొత్త సబ్‌స్టేషన్‌లు మంజూరు చేశారు.

హరిత హారం

హరిత హారం

ప్రతి ఊరులో 40 వేల మొక్కలు నాటాలని సీఎం పిలుపునిచ్చారు. వానలు కురుపించుకోవడం మన చేతుల్లోనే ఉంది.

హరిత హారం

హరిత హారం

హరితహారం సక్సెస్ చేసి దేశం అంతా మనలను చూసి నేర్చుకొనేలా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిపై ఉందన్నారు.

చెట్ల పెంపకంతో వర్షాలు విస్తారంగా కురుస్తాయన్నారు. పర్యావరణం దెబ్బతినడం వల్లనే వర్షాలు సకాలంలో పడటం లేవని, అడవుల విస్తీర్ణం పెంచేందుకే హరితహారం అన్నారు. ప్రకృతి సమత్యులతను చెట్లు ఎంతగానో దోహదపడుతాయన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అడవుల సంరక్షణకు కేటాయించిన రూ.35 వేల కోట్లు మరుగున పడ్డాయన్నారు. క్యాంపా నిధులన్నీ రాష్ర్టాలకు అందిస్తామన్నారు.

కాగా, తనకు తెలుగు వచ్చునని, కానీ నేను మాట్లాడిన తెలుగు మీకు అర్థం కాకపోవచ్చునని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. జవదేకర్ జై తెలంగాణ అంటూ తన ఉపన్యాసం ప్రారంభించారు. అందరికీ నమస్కారం అని తెలుగులో సంబోధించారు.

English summary
Prakash Javadekar praises TRS government for Haritha Haram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X