హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రికెట్ బాల్ తగిలి కొడుక్కి గాయం: హైదరాబాద్ తీసుకొచ్చిన ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ దంపతులు శనివారం నాడు హైదరాబాద్ వచ్చారు. తన కుమారుడు రైహన్‌కు కంటి సంబంధిత పరీక్షల నిమిత్తం వారు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ దంపతులు శనివారం నాడు హైదరాబాద్ వచ్చారు. తన కుమారుడు రైహన్‌కు కంటి సంబంధిత పరీక్షల నిమిత్తం వారు వచ్చారు.

హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో తనయుడికి పరీక్షలు చేయించారు. రైహాన్ క్రికెట్ ఆడుతుండగా కంటికి గాయమైంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఎయిమ్స్ వైద్యులు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి సిఫార్సు చేశారు.

హైదరాబాద్‌కు రాక

హైదరాబాద్‌కు రాక

దీంతో ప్రియాంక-రాబర్ట్‌ వాద్రాలు కుమారుడు రైహన్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలలో కంటి పరీక్షలు చేశారు.

పరీక్షలు చేశారు

పరీక్షలు చేశారు

ప్రియాంక దంపతులు తమ కుమారుడితోపాటు సుబ్బరామి రెడ్డి కుమార్తె పింకిరెడ్డితో కలిసి శనివారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్నారు. వెంటనే ముగ్గురు వైద్యులు రైహన్‌కు పరీక్షలు నిర్వహించారు.

క్రికెట్ ఆడుతుండగా..

క్రికెట్ ఆడుతుండగా..

అప్పటి వరకు ప్రియాంక దంపతులు ఆసుపత్రిలోనే గడిపారు. కొన్ని రోజుల రైహాన్ క్రికెట్‌ ఆడతుండగా ఎడమ కంటికి గాయమైంది. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతండగా.. ఎయిమ్స్ వైద్యుల సిఫార్సుతో పాటు.. పరామర్శకు వెళ్లిన కాంగ్రెస్‌ నేత సుబ్బరామి రెడ్డి కూడా ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యుల సలహా కూడా తీసుకోవాలని ప్రియాంకకు సూచించారని తెలుస్తోంది.

కంటికి ప్రమాదం లేదు..

కంటికి ప్రమాదం లేదు..

దాదాపు రెండు మూడు గంటల పాటు పలు పరీక్షలు చేసిన సీనియర్‌ వైద్యులు అంతా సవ్యంగా ఉందని, కంటికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారని తెలుస్తోంది. కాగా, ప్రియాంక పర్యటన తమకు తెలియదని, ఇది వారి వ్యక్తిగత పర్యటన అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, ఇది రాజకీయ పర్యటన కాదని ముందే ఇక్కడి నేతలకు చెప్పారని తెలుస్తోంది.

English summary
Congress’s star campaigner in Uttar Pradesh elections Priyanka Gandhi Vadra, along with her businessman-husband Robert Vadra, paid a brief visit to Hyderabad on Saturday to get their son Raihan treated for an eye-injury.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X