హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాఫ్ట్‌వేర్ అమ్మాయిలంటూ జూబ్లీహిల్స్‌లో వ్యభిచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాప్ట్‌వేర్ అమ్మాయిలంటూ వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్‌కు పంపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖపట్నంకు చెందిన ఎ. లక్ష్మీనారాయణ(27), కాకినాడకు చెందిన ఓ మహిళ (35) వైజాగ్, కాకినాడ, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 2లోని ఉమెన్ కో ఆపరేటివ్ సొసైటీలోని ఓ అద్దె ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నారు.

Prostitution Caught By Police In Jubilee Hills

ఇక్కడికి వచ్చి విటులకు తమ వద్ద ఉన్నది సాప్ట్‌వేర్ ఇంజనీర్లైన యువతులని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కస్టమర్లకు అమ్మాయిలను సాప్ట్‌వేర్ ఇంజనీర్లని నమ్మించేందుకు నకిలీ ఐడీ కార్డులను కూడా తయారు చేయించి ఇచ్చారని తెలిపారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధారాత్రి ఇంటిపై దాడులు నిర్వహించి నిర్వాహకులు లక్ష్మీనారాయణ, మహిళను అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందిన శ్రావణ్‌రెడ్డి అనే యువకుడు అక్కడి యువతిని పది రోజులకు రూ. 50 వేలు ఇస్తానంటూ నమ్మించి ఈ వ్యభిచార గృహంలో వదిలేశాడని పోలీసులు తెలిపారు. వీరితో పాటు ఓ యువతిని రెస్క్కూ హోంకు తరలించారు.

English summary
Prostitution Caught By Police In Jubilee Hills.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X