హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వంతెనపై వేలాడుతున్న లారీ: రంగంలోకి 'మా', ఆల్విన్‌ కాలనీలో మంచు లక్ష్మీ, మనోజ్‌

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శనివారం కూడా నగరంలో వర్ష ప్రభావం కొనసాగుతూనే ఉంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి.

రాష్ట్రంలోని అన్ని చోట్ల విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం ఇంకా కోలుకోలేదు. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఉద్యోగస్తులు కార్యాలయాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎక్కడ చిన్నపాటి వరద వచ్చిన తక్షణమే సరిదిద్దేలా చర్యలు తీసుకుంటుంది. మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు స్వయంగా వర్షాభావ పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

 వంతెన అంచుపై వేలాడుతున్న లారీ

వంతెన అంచుపై వేలాడుతున్న లారీ

తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో మంజీరా నదిపై లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బ్రిడ్జి అంచున ఆగిపోయింది. ఈ సంఘటన మనురు మండలం రాయిపల్లి వద్ద శనివారం చోటు చేసుకుంది. బీదర్ వైపు పండ్లు లోడుతో మంజీరా నది బ్రిడ్జ్ పై వెళుతుండగా లారీ టైర్ పంక్చర్ అయింది.

 అదుపు తప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టింది

అదుపు తప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టింది

దీంతో అదుపు తప్పి బ్రిడ్జి గోడను ఢీకొట్టి వాగువైపుకు దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ బ్రిడ్జి అంచన లారీ ఆగిపోయి వేళాడుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌, క్లీనర్‌ వంతెనపై దూకి ప్రాణాలతో బయటపడ్డారు. లారీ బ్యాలెన్స్ తప్పి వాగులో పడిపోకుండా అటు వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. లారీని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

వరద బాధితులకు ‘మా' చేయూత

వరద బాధితులకు ‘మా' చేయూత

వరద బాధితులకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) చేయూతనిచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 'మా' ఆధ్వర్యంలో ఆహారం, తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మా అధ్యక్షడు రాజేంద్రప్రసాద్, సభ్యుడు శివాజీరాజా ఆల్విన్‌ కాలనీలో వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. మంచు లక్ష్మీ, మనోజ్, నవదీప్ తదితరులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

వరద నీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు

వరద నీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు

నగరంలోని ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం, శనివారం స్కూళ్లకు సెలవులు ప్రకటించినా శనివారం నగర శివార్లలో పలు స్కూళ్లు కొనసాగుతున్నాయి. ఆల్విన్‌కాలనీలో ధరణీనగర్‌లో ఓ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది.

స్థానికుల అప్రమత్తతతో విద్యార్థులకు తప్పిన ముప్పు

స్థానికుల అప్రమత్తతతో విద్యార్థులకు తప్పిన ముప్పు

వరద నీరు ఉన్నప్పటికీ డ్రైవర్‌ బస్సును తీసుకెళ్లాడు. దీంతో వరదనీటిలో బస్సు చిక్కుకుపోయింది. అయితే స్థానికుల అప్రమత్తతతో 40 మంది విద్యార్థులకు ముప్పు తప్పింది. స్థానికులందరూ కలిసి బస్సును బయటకు తీశారు. వరద నీటిలో బస్సును తీసుకెళ్లిన డ్రైవర్‌పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరద నీటిలోనే ఆల్విన్ కాలనీ

వరద నీటిలోనే ఆల్విన్ కాలనీ

హైదరాబాద్‌లో వర్షాలు తగ్గుముఖం పట్టడంలేదు. హైదరాబాద్‌లోని ఆల్విన్‌కాలనీ ఇంకా వరదనీటిలోనే ఉంది. చెరువుకట్ట తెగడంతో మూడు కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నీరు అలాగే ఉండిపోవడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సహాయక చర్యలపై అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిజాంపేట్‌లో తగ్గని వరద

నిజాంపేట్‌లో తగ్గని వరద

నగరంలోని నిజాంపేట్‌లో వరద ఏమాత్రం తగ్గలేదు. కాలనీవాసులు ఐదురోజులుగా వరద నీటిలోనే కాలం గడుపుతున్నారు. సెల్లార్స్‌లో నిర్మించిన షాపులు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో యజమానులు భారీగా నష్టపోయారు. గ్రామ పంచాయతీ కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని, హెచ్ఎండీఏకు చెందిన ఏ అధికారి ఇక్కడకు రావడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాల్ సెంటర్ నెంబర్లను ప్రకటించిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ ఇంకా జలదిగ్బంధంలో ఉంది. ఇంకో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ సహాయ చర్యలు చేపట్టింది. సాయం కోసం కాల్ సెంటర్ నంబర్లను ప్రకటించింది.
జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నెంబర్‌: 040 24111111
జీహెచ్‌ఎంసీ సెక్షన్‌ జోన్‌ నెంబర్‌: 040-27804012
జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-1 నెంబర్‌: 040-24525841
సర్కిల్‌-2: 040-24525842, సర్కిల్‌-3: 040-24736912
సర్కిల్‌-4: 040-23326975, సర్కిల్‌-5: 040-24525845
సర్కిల్‌-6: 040-24740211, సర్కిల్‌-7: 040-27804012

English summary
puncture lorry stuck in middle of bride at medak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X