వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధు సహా వారికి బీఎండబ్ల్యు కార్లు ఇచ్చిన సచిన్, సెల్ఫీ దిగారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఒలింపిక్ విజయాలకు ఇది ప్రారంభం మాత్రమేనని, విజయపరంపర ఆగకూడదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆదివారం నాడు అన్నారు. ఆదివారం గచ్చిబౌలీ స్టేడియంలో ఒలింపిక్‌ విజేతలకు బీఎండబ్ల్యూ కార్లను బహూకరించారు.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడారు. సాక్షి మాలిక్, పీవీ సింధు, దీపా కర్మాకర్‌లను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. భారతీయ క్రీడలకు ఇది శుభదినమన్నారు. ఒలింపిక్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు.

సింధు వెన్నంటి ఉండి గోపిచంద్‌ చక్కగా ప్రోత్సహించారన్నారు. తాను మ్యాచులను ఉత్కంఠగా చూశానని చెప్పారు. దీపా కర్మాకర్ పతకం గెలవకున్నా దేశ ప్రజల మనసులు గెలుచుకుందన్నారు. కోచ్‌గా గోపీచంద్ సేవలు అమోఘమన్నారు.

సెల్ఫీ తీసుకున్న సచిన్

ఒలింపిక్స్‌లో పాల్గొని అద్భుత ప్రతిభ చూపిన సింధు, సాక్షి, దీప, బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌లతో సచిన్‌ టెండుల్కర్ సెల్ఫీ తీసుకున్నారు. అంతకుముందు హైదరాబాద్ వచ్చిన సచిన్ టెండుల్కర్ నేరుగా పుల్లెల గోపీచంద్ అకాడమీకి చేరుకున్నారు.

గోపీచంద్ మాట్లాడుతూ.. రియోలో ముగ్గురు చక్కగా రాణించారని చెప్పారు. భవిష్యత్తులో మరింత బాగా రాణిస్తారని భావిస్తున్నానని చెప్పారు. సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. తాను ఒంటరిగా వెళ్లి, కోట్లాది భారతీయుల అభిమానంతో తిరిగి వచ్చానన్నారు. దీపా కర్మాకర్ మాట్లాడుతూ... ఇంతటి ప్రోత్సాహం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు. పీవీ సింధు మాట్లాడుతూ.. మరిన్ని విజయాలు సాధిస్తానన్నారు.

బహుమతి

బహుమతి

ఒలింపిక్ విజయాలకు ఇది ప్రారంభం మాత్రమేనని, విజయపరంపర ఆగకూడదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆదివారం నాడు అన్నారు. ఆదివారం గచ్చిబౌలీ స్టేడియంలో ఒలింపిక్‌ విజేతలకు బీఎండబ్ల్యూ కార్లను బహూకరించారు.

మొక్కు తీర్చుకున్న పీవీ సింధు

మొక్కు తీర్చుకున్న పీవీ సింధు

రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు శనివారం నాడు భాగ్యనగరంలోని లాల్ దర్వాజలో మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రతి ఏడాది అమ్మవారి ఆశీస్సులు

ప్రతి ఏడాది అమ్మవారి ఆశీస్సులు

ఈ సందర్భంగా పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటానని, రియో బయలుదేరే ముందు అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు.

మొక్కుకున్నా

మొక్కుకున్నా

పతకం గెలిస్తే మళ్లీ దర్శించుకుంటానని మొక్కుకున్నానని సింధు అన్నారు. పతకం గెలవడంతో కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పారు.

పీవీ సింధు

పీవీ సింధు

లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పీవీ సింధుకు జాతీయ పతాకాలతోను పలువురు స్వాగతం పలికారు.

పీవీ సింధు

పీవీ సింధు

రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు శనివారం నాడు భాగ్యనగరంలోని లాల్ దర్వాజలో మహంకాళీ అమ్మవారిని దర్శించుకొని, మొక్కు చెల్లించుకున్నారు.

పీవీ సింధు

పీవీ సింధు

రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు శనివారం నాడు భాగ్యనగరంలోని లాల్ దర్వాజలో మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు.

పీవీ సింధు

పీవీ సింధు

రియో ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు శనివారం నాడు భాగ్యనగరంలోని లాల్ దర్వాజలో మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ యాజమాన్యం ఆమెను సన్మానించింది.

English summary
Sachin Tendulkar, Gopichand, PV Sindhu, Sakshi Malik Dipa Karmakar take a selfie at the felicitation ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X