వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శిరీష మృతిపై అనుమానాలుంటే హైదరాబాద్ రండి', 'రెండో హ్యాండ్ బ్యాగ్ ఎవరిది'

బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ఆమె కుటుంబ సభ్యులు, ఇతరులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై డిసిపి వెంకటేశ్వర రావు మంగళవారం స్పందించారు. శిరీష అనుమానాస్పద మృతి విషయంలో పోలీసుల విచారణ వేగవంతం చేశామన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో ఆమె కుటుంబ సభ్యులు, ఇతరులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై డిసిపి వెంకటేశ్వర రావు మంగళవారం స్పందించారు. శిరీష అనుమానాస్పద మృతి విషయంలో పోలీసుల విచారణ వేగవంతం చేశామన్నారు.

ఏం జరిగిందంటే... ఎఫ్ఐఆర్‌లో ఇలా: 'శిరీష కేసులో పోలీసుల హడావుడి'ఏం జరిగిందంటే... ఎఫ్ఐఆర్‌లో ఇలా: 'శిరీష కేసులో పోలీసుల హడావుడి'

నిందితులు రాజీవ్, శ్రవణ్‌లతో పాటు పలువురిని ప్రశ్నించామని ఆయన వెల్లడించారు. ఈ కేసులో అనవసర విమర్శలు చేయవద్దని హెచ్చరించారు.

అనుమానాలు ఉంటే హైదరాబాద్ రండి

అనుమానాలు ఉంటే హైదరాబాద్ రండి

శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్‌కు వస్తే, వారి అనుమానాలన్నింటిని నివృత్తి చేస్తామని డిసిపి తెలిపారు. ఆమె బంధువులు మీడియా ముందు చేస్తున్న విమర్శలు సరికావని ఆయన అభిప్రాయపడ్డారు.

వాట్సాప్ లొకేషన్ అక్కడే ఉంది..

వాట్సాప్ లొకేషన్ అక్కడే ఉంది..

తమకు ఎవరినీ కాపాడాలన్న ఉద్దేశం గానీ, అవసరం గానీ లేవని డిసిపి అన్నారు. శిరీష పంపిన వాట్సాప్ లొకేషన్ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ క్వార్టర్సుదేనని ఆయన చెప్పారు.

అత్యాచారంపై విచారణలో తేలుతుంది

అత్యాచారంపై విచారణలో తేలుతుంది

ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని డిసిపి తెలిపారు. కేసును తాము తప్పుదోప పట్టిస్తున్నామనే విమర్శలు సరికాదని చెబుతూ, ఆ విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

రెండు కీలక విషయాలు

రెండు కీలక విషయాలు

కాగా, విచారణలో రాజీవ్, శ్రావణ్‌లు కీలక విషయాలు వెల్లడిస్తున్నారని తెలుస్తోంది. ఏ2 నిందితుడు రాజీవ్ రెండు కీలక విషయాలు వెల్లడించాడు. శిరీషను వదిలించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నానని చెప్పాడని, ముందు తేజస్వినిని వదిలించుకుని, తర్వాత శిరీషను వదిలించుకోవచ్చనుకున్నానని, అందుకే తేజస్వినిని వదిలించుకునేందుకు ముగ్గురం కలిసి కప్పా కాఫీ షాప్‌కు వెళ్లి మూడు గంటలపాటు సమాలోచనలు జరిపామని చెప్పాడని తెలుస్తోంది. అనంతరం శ్రవణ్ సూచనతోనే కుకునూరుపల్లి ఎస్సై దగ్గరకు తీసుకువెళ్లానని తెలిపాడు. శ్రవణ్, తాను బయటకు వచ్చామని, తర్వాత మళ్లీ లోపలకు వెళుతూ, తలుపు సందులోంచి చూసినప్పుడు శిరీషను ఎస్సై అత్యాచారయత్నం చేస్తున్నట్టు కనిపించిందని, ఆ తర్వాత తిరిగి వస్తున్నప్పుడు కారులో అరిచి గోలచేయడంతో రెండు మూడు సార్లు కొట్టానని రాజీవ్ చెప్పాడు. అత్యాచారయత్నం మాత్రమే జరిగితే ఆమె ఎందుకు అరిచి గోల చేసిందని పోలీసులు ప్రశ్నించారని తెలుస్తోంది.

కుటుంబ సభ్యుల ఆరోపణ

కుటుంబ సభ్యుల ఆరోపణ


మరోవైపు, శిరీషను రాజీవ్, శ్రవణ్‌లు మాత్రమే చంపలేదని ఆమె పిన్ని కూడా ఆరోపించారు. శిరీషను ఒక్కరో లేక ఇద్దరో ఏమీ చేయలేరన్నారు. ఆమె చేతులను చూస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. ఆరు అడుగుల పొడవైన శిరీషను ఒక్కరో లేక ఇద్దరో లోంగదీసుకోవడం అయ్యేపని కాదన్నారు. శిరీష హత్యలో ముగ్గురో లేక నలుగురో ఉండి ఉంటారని కొత్త అనుమానాలు లేవనెత్తారు.

మరో హ్యాండ్ బ్యాగ్ ఎవరిది?

మరో హ్యాండ్ బ్యాగ్ ఎవరిది?

శిరీష ఆత్మహత్య ఘటన అనంతరం ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను ఆమె భర్త పోలీసులకు ఇచ్చాడని, అయితే కారులో ఉన్న మరొకరి హ్యాండ్ బ్యాగ్ ఎవరిదని ఆమె అడిగారు. ఈ కేసులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని నిర్ధారించేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ఆమె ప్రశ్నించారు. ఆరు అడుగుల మనిషి ఫ్యాన్ కు వేలాడితే ఫ్యాన్ రెక్కలు కనీసం వంగిపోతాయన్నారు. అలాగే ఫ్యాంటు, షర్టు వేసుకున్న శిరీష దగ్గరకి చున్నీ ఎలా వచ్చిందని ఆమె నిలదీశారు. శిరీషను హత్య చేశారని ఎవరికైనా అర్థమవుతుందని ఆమె తెలిపారు.

మరోవైపు, పోలీసుల విచారణలో రాజీవ్ కీలక విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. శిరీషను తాము బెదిరించాలనుకున్నామని, ఆమె కేసు పెడితే తమవైపు మొగ్గేలా చూడాలనుకున్నామని చెప్పాడని తెలుస్తోంది. శిరీషను భయపెట్టేందుకే కుకునూరుపల్లికి వెళ్లామని చెప్పాడని తెలుస్తోంది. శిరీషను బెదిరించాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయిందని చెప్పాడని తెలుస్తోంది.

English summary
Rajeev and Sravan reveal shocking facts on Beautician Sirisha death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X