వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరేనన్నాడు, ఇంతలో అంతా అయిపోయింది: శ్రీనివాస్ కూచిభొట్ల భార్య కన్నీరుమున్నీరు

ఆ రోజు రాత్రి ఏడున్నర గంటలకే ఇంటికి వస్తానని చెప్పాడని శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన అన్నారు. ఆమె బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆ రోజు ఆస్టిన్‌ బార్‌(కాన్స్‌స)లో కాల్పులు జరిగిన విషయం నాకు తెలిసింది గానీ చనిపోయింది తన భర్తేనన్న విషయం తెలియలేదని శ్రీనివాస్‌ కూచిభొట్ల భార్య సునయన అన్నారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు.

భర్త మరణంతో తన లోకం ఒక్కసారిగా చీకటైపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 22 ఉదయం ఆఫీసుకు వెళ్తూ తన భర్త తనకు బై చెప్పాడని, ఆయన్ను ప్రాణాలతో చూడ్డం అదే ఆఖరుసారి అని సునయన కంటతడిపెట్టారు. అప్పటికి రెండు రోజులుగా రాత్రిపూట ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని ఆమె చెప్పారు.

దాంతో 'ఈ రోజు వర్క్‌ ఏదైనా ఉంటే ఇంటికి తెచ్చుకో. ఇద్దరం కలిసి కాసేపు టీ తాగుతూ మాట్లాడుకుందాం' అని తాను మెసేజ్‌ పెట్టానని, సరేనంటూ శ్రీనివాస్‌ తన మెసేజ్‌కు సానుకూలంగా స్పందించాడని సునయన చెప్పారు.

ఏడింటికల్లా ఇంట్లో ఉంటానన్నాడు...

ఏడింటికల్లా ఇంట్లో ఉంటానన్నాడు...

రాత్రి 7 గంటలకల్లా ఇంట్లో ఉంటానని చెప్పాడని, 8 గంటలైనా రాకపోవడంతో తాను ఆందోళన చెందానని సునయన అన్నారు. అలోక్‌ భార్యకు ఇతర స్నేహితులకు కూడా ఫోన్‌ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత తాను భోజనం చేస్తూ అలవాటుగా ఫేస్‌బుక్‌ చూస్తున్నానని, అందులో ఒక వీడియో.. కాల్పులు జరిగాయని ఉందని చెప్పారు. ‘

ఎక్కడో ఏదో జరిగిందని అనుకున్నారు..

ఎక్కడో ఏదో జరిగిందని అనుకున్నారు..

మళ్లీ ఎక్కడో ఏదో జరిగినట్లుందని, ఎవరో గాయపడి ఉంటారని అనుకున్నానని, ఇంతలోనే ఆస్టిన్స్‌ పేరు కనిపించిందని,. కాల్పుల బాధితులను యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సస్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారని అందులో చదివి వెంటనే బయల్దేరానని, గ్యారేజ్‌ దాకా వెళ్లి అక్కడే కుప్పకూలిపోయానని, తర్వాత మా ఇంటికి ఇద్దరు పోలీసులు వచ్చారని సునయన చెప్పారు.

నా పేరు, శ్రీని పేరు అడిగారు..

నా పేరు, శ్రీని పేరు అడిగారు..

తన పేరు, శ్రీని పేరు అడిగారని, ఆయన పుట్టినరోజు అడిగారని సునయన చెబుతూ ఆ తర్వాత వాళ్లు ‘వియ్‌ ఆర్‌ సారీ' అని చెప్పారని చెప్పారు. తర్వాత తాను ఆందోళనతో చేరుకున్నానని, సెక్యూరిటీ వాళ్లు తనిఖీల కోసం ఆపారని, తన భర్త చనిపోయారని చెప్పినా లోపలికి పంపలేదని సునయన చెప్పారు.

ఇటీవలే తండ్రికి కారు కొనిచ్చారు..

ఇటీవలే తండ్రికి కారు కొనిచ్చారు..

శ్రీనివాస్‌ ఇటీవలే తన తండ్రికి ఒక కారు కొనిచ్చారని, కొడుకు ఇచ్చిన ఆ బహుమతి చూసి తన మామ ఆనందించారని సునయన చెప్పారు.నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఎంతగానో భయపడ్డానని.. భయంతో సరిగా నిద్ర కూడా పోయేదాన్ని కానని చెప్పారు. తన భర్త అమెరికాను ఎంతగానో ప్రేమించేవాడని సునయన చెప్పారు.

English summary
The deceased in Kansas firing, srinivas Kuchibhotla's wife Sunayana disclosed how she got the information of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X