హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూర్ క్రిక్కిరిసిపోతోంది, హైదరాబాద్‌కే ఐటి కంపెనీలు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తేవడంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో అననారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య నేతలు శనివారం కెసిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

ప్రపంచంలో ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులదే కీలక పాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా సమాఖ్యగా ఏర్పడి ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లో మూడు నాలుగు వేల ఎకరాల్లో ప్రత్యేకంగా నగరాన్ని నిర్మించాలని సూచించారు. గ్రీన్‌ఫీల్డ్ ఆక్టివిటీ పెంచాలని సూచించారు.

Real Estate will paly main role in hyderabad development: KCR

రియల్ ఎస్టేట్‌రంగంలో పారదర్శకత కోసం టీఎస్ ఐపాస్ లాంటి చట్టం తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు నగరం కిక్కిరిసి పోతున్నందున సాఫ్ట్‌వేర్ కంపెనీలు హైదరాబాద్‌కే తరలి వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరం చుట్టు పక్కల హెల్త్, ఫార్మా, సినీ సిటీలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం బిజినెస్ ఎట్ ఈజ్ పద్ధతిలో జరగాలని తెలిపారు. ఆకాశహార్మ్యాల నిర్మాణంపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు దృష్టి సారించాలని అన్నారు. హైదరాబాద్ నగర గమనాన్నిఅర్థం చేసుకుంటూనే ఇతర నగరాలను అధ్యయనం చేయాలని సూచించారు. భూముల లేఅవుట్లకు అనుమతులిచ్చే విషయంలో, నిబంధనలను పాటించే విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామని తెలిపారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao told real estate businessmen that Real estate should play a key role in Hyderabad development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X