హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్పత్రిని తరలిస్తారా?: పొరబడి మహిళల నిరసన, ట్రాఫిక్ జాం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓపీని గురువారం సిబ్బంది ఆలస్యంగా తెరవడం రోగులను గందరగోళానికి గురిచేసింది. ఆస్పత్రిని వేరే చోటుకు తరలించేందుకే ఓపీని తెరవలేదని భావించిన గర్భిణులు తమ బంధువులతో కలసి రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గర్భిణులు వైద్య పరీక్షల నిమిత్తం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన ఓపీ ఎంతకీ తెరవకపోవడంతో చికిత్సకు వచ్చినవారు కలవరపడ్డారు. అక్కడి నుంచి ప్రసూతి ఆస్పత్రిని తరలించారని, ఇక వైద్యసేవలు అందవని కొందరు చెప్పడంతో వందలాది మంది రోగులు కోఠి ఉమెన్స్ కళాశాల రోడ్డుపై బైఠాయించారు.

దీంతో కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా నుండి ఇసామియాబజార్, చాదర్‌ఘాట్, ఇటువైపు సుల్తాన్‌బజార్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా, బ్యాంక్‌స్ట్రీట్, ఉస్మానియా మెడికల్ కళాశాల రోడ్డు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సుల్తాన్‌బజార్ పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పారు. ఆస్పత్రి వర్గాలు కూడా అప్రమత్తమై ఓపీని తొమ్మిది గంటల తర్వాత తెరవడంతో పరిస్థితి సద్దుమణిగింది. రోగులు, ఆస్పత్రి సిబ్బంది మధ్య సమాచారం కొరవడడం వల్లే గందరగోళానికి దారితీసినట్లు తెలుస్తోంది.

మహిళల నిరసన

మహిళల నిరసన

సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఓపీని గురువారం సిబ్బంది ఆలస్యంగా తెరవడం రోగులను గందరగోళానికి గురిచేసింది.

మహిళల నిరసన

మహిళల నిరసన

ఆస్పత్రిని వేరే చోటుకు తరలించేందుకే ఓపీని తెరవలేదని భావించిన గర్భిణులు తమ బంధువులతో కలసి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

మహిళల నిరసన

మహిళల నిరసన

గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గర్భిణులు వైద్య పరీక్షల నిమిత్తం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు.

మహిళల నిరసన

మహిళల నిరసన

ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన ఓపీ ఎంతకీ తెరవకపోవడంతో చికిత్సకు వచ్చినవారు కలవరపడ్డారు.

మహిళల నిరసన

మహిళల నిరసన

అక్కడి నుంచి ప్రసూతి ఆస్పత్రిని తరలించారని, ఇక వైద్యసేవలు అందవని కొందరు చెప్పడంతో వందలాది మంది రోగులు కోఠి ఉమెన్స్ కళాశాల రోడ్డుపై బైఠాయించారు.

మహిళల నిరసన

మహిళల నిరసన

దీంతో కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తా నుండి ఇసామియాబజార్, చాదర్‌ఘాట్, ఇటువైపు సుల్తాన్‌బజార్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా, బ్యాంక్‌స్ట్రీట్, ఉస్మానియా మెడికల్ కళాశాల రోడ్డు వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

మహిళల నిరసన

మహిళల నిరసన

సుల్తాన్‌బజార్ పోలీసులు ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పారు.

స్పృహ కోల్పోయిన మహిళ

స్పృహ కోల్పోయిన మహిళ

ఆస్పత్రి వర్గాలు కూడా అప్రమత్తమై ఓపీని తొమ్మిది గంటల తర్వాత తెరవడంతో పరిస్థితి సద్దుమణిగింది. రోగులు, ఆస్పత్రి సిబ్బంది మధ్య సమాచారం కొరవడడం వల్లే గందరగోళానికి దారితీసినట్లు తెలుస్తోంది.

English summary
Relatives, patients of Koti maternity hospital stages dharna at Koti, Hyderabad, protesting against shifting hospital to Petlaburj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X