వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ కసాయి: కెసిఆర్‌‌పై రేవంత్ ఫైర్, మీరు ద్రోహులేనని హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

మెదక్‌/తిరుపతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రా నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ టిడిపి నాయకులు ఆంధ్రా పాలకులకు వంత పాడి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించిన హంద్రీనీవా, పట్టిసీమ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులిచ్చిన ప్రాజెక్టులనే తాము ఇప్పుడు కడుతున్నట్లు చెప్పారు. రాజకీయాల కోసం ప్రాజెక్టులు అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మెదక్‌ జిల్లా సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లో ఆదివారం మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గంగకత్వ కాలువ ఆధునికీకరణతో పాటు మిలిగిరిపేట, మాల్కాపూర్‌ చెరువులో మిషన్‌ కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి మరింత కష్టపడాలని ఇంజినీర్లకు హరీశ్‌రావు సూచించారు.

Revanth fires at KCR, Harish at TTDP

కసాయి లాంటి కెసిఆర్‌ను నమ్ముతున్నారు: రేవంత్

తిరుపతి: అబద్దాలతోనే టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారని తెలంగాణ టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కసాయిని నమ్మినట్టు కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మారని ఆయన చెప్పారు. తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా 'టిఆర్ఎస్ ప్రభుత్వం-హామీల అమలులో వైఫల్యం' అన్న తీర్మానాన్ని ఆయన సభలో ప్రవేశపెట్టారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకుంటామని కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని తెలంగాణ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. కోటి మందికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, నిరుపేదలకు మూడెకరాల భూమి హామీలు ఎందుకు అమలు కాలేదో తెలంగాణ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వికలాంగులకు, మైనారిటీలకు రిజర్వేషన్లు అంటూ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. అధికారంలోకి రావడానికి హామీలు గుప్పించిన కేసీఆర్‌... ఆ తర్వాత వాటిని గాలికొదిలేశారని విమర్శించారు. తెలంగాణలో రెండేళ్లలో రూ.2.5 లక్షల కోట్లు ఖర్చుచేశారు కాని అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. టీడీపీ వల్లే తెలంగాణలో సామాజిక న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. 2019 ఎన్నికల్లో మిషన్‌ 99 టార్గెట్‌గా పనిచేస్తామని రేవంత్‌రెడ్డి హామినిచ్చారు.

English summary
Telugudesam Party senior leader Revanth Reddy on Sunday fired at Telangana CM K Chandrasekhar Rao, and Telangana minister Harish Rao lashed at TTDP leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X