వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో రూ.1కి బదులు 25 వసూలు: ఖైదీల కోసం రేవంత్ పోరాటం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొడంగల్/హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఖైదీలు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అరెస్టై నెల రోజులు జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయన రెండు రోజుల క్రితం విడుదలయ్యారు. కోర్టు షరతుల మేరకు ఆయన కొడంగల్ వెళ్లారు.

ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చర్లపల్లి జైల్లో ఒంటరి జీవితం గడుపుతున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడేందుకు అక్కడి సిబ్బందికి రూ.25 చొప్పున చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వాస్తవానికి ఖైదీలకు వారంలో రెండు రోజులు వారి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే వెసులుబాటు ఉందన్నారు. అందుకుగాను ఖైదీల నుంచి ఒక్కో ఫోన్ కాల్‌కు రూపాయి మాత్రమే తీసుకోవాల్సి ఉన్నా జైలు సిబ్బంది రూ.25 తీసుకుంటున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ప్రస్తుతం రూ.25తో అమెరికాకు సైతం మాట్లాడవచ్చన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పారు. ఉపాధి హామీ కూలీలు పని చేస్తే ఒకపూటకు రూ.170 చెల్లిస్తున్న ప్రభుత్వం, ఖైదీలు రోజంతా కష్టపడి పని చేసినా ఇచ్చేది రూ.30 మాత్రమే అన్నారు.

చర్లపల్లి జైలు

చర్లపల్లి జైలు

జైల్లో వారికి సన్నబియ్యం ఇస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కోర్టు ఉత్తర్వులున్నందున తాను ఎక్కువగా మాట్లాడవద్దన్నారు.

తెలంగాణ టీడీపీ

తెలంగాణ టీడీపీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి, రాజారామ్ యాదవ్, పీ రాములు తదితరులు గురువారం నాడు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్ల పనులపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నీటిబుడగల మాదిరిగా ఉన్నాయన్నారు.

తెలంగాణ టీడీపీ

తెలంగాణ టీడీపీ

పుష్కరాల పనుల్లో తమ అనుయాయులకు నిధులు దోచిపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కుంభమేలాను మించి పుష్కరాలు ఏర్పాట్లు చేస్తామన్న కేసీఆర్, కనీసం అందులో సగం ్యినా చేయాలన్నారు.

English summary
Telangana TDP leader Revanth Reddy to fight for Prisoners
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X