వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పదవికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఒక వ్యక్తికి ఒకే పదవి విధానంలో భాగంగా డిప్యూటీ లీడర్‌ పదవి వదులుకోవాలని రేవంత్‌ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం

ఈ క్రమంలోనే మరో రెండు రోజుల్లో ఫ్లోర్‌ లీడర్‌ ఎర్రబెల్లి దయాకర్ రావుకు రాజీనామా లేఖను పంపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, తాను వదులుకున్న పదవిని ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్‌కు గానీ, రాజేందర్‌రెడ్డిలకు ఇవ్వాలని పార్టీ అధినాయకత్వానికి సూచించే యోచనలో రేవంత్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Revanth reddy may resign for deputy floor leader post

ఎల్ రమణను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ధీటుగా ఎదుర్కునే ఉద్దేశంతో చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఆ పదవిని అప్పగించారు.

కాగా, ఓటుకు నోటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి ఇటీవల కోర్టు నుంచి అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

English summary
Telangana Telugu Desam party working president Revanth Reddy may resign for the floor leader post soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X