వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆట మొదలైంది, ఏడ్వలేదు స్కాం ఫైళ్లు చదివా: బద్మాష్ అంటూ మీసం తిప్పిన రేవంత్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో చర్లపల్లి జైలు నుండి విడుదలైన రేవంత్ రెడ్డి బుధవారం మరోసారి మీసం మెలెసి, తొడగొట్టడం గమనార్హం. రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ వెళ్లే దారిలో 'ఆట మొదలైంది' అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డిని ఆ బ్యానర్లలో సింహంగా చూపించారు.

జైలు నుంచి బెయిల్ పైన విడుదలై ర్యాలీగా సాగిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పైన విధించిన నిషేధం గురించి ప్రస్తావించారు. జైలులో ఇచ్చిన టీవీలో దూరదర్శన్ తర్వాత వచ్చేది ఏబీఎన్ ఛానలే అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిషేధించిన ఛానల్‌ను తాము జైలులో చూశామన్నారు. నీ బతుకను బయటపెట్టినందుకు ఏబీఎన్, టీవీ 9 గొంతు కోశావని మండిపడ్డారు. అదే ముసుగులో ఒక ఛానల్‌ను బెదిరించి నీ బినామీ పేర్లతో వాటాలు రాబట్టుకున్నావని, వాటిని బయటపెడతామని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ను గద్దెదించుతానని, కేసీఆర్‌ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమి కొట్టేలా ప్రజలను చైతన్యపరుస్తానని, ప్రతి యువకుడిని భుజం తట్టి లేపుతానని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఓటుకు నోటు కేసులో బెయిలుపై విడుదలైన తర్వాత... చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా బయలుదేరిన రేవంత్ మార్గమధ్యంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులను తీవ్ర పదజాలంతో దునుమాడారు. మంత్రుల పేర్లు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అవినీతిని నిలదీసినందునే కుట్రపూరితంగా తనను కేసులో ఇరికించారని రేవంత్‌ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి


రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తన మొట్టమొదటి సంతకంతోనే మైహోం రామేశ్వర రావుకు 3 వేల కోట్ల భూమిని అక్రమంగా కట్టబెట్టారని, దీనిని నేను ప్రశ్నించానని, మెడికల్‌ ఫీజులు అడ్డగోలుగా పెంచడంపై హైకోర్టులో కేసు వేశానని, కేసీఆర్‌ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెబుతుంటే నిలదీశానని అందుకే, నాపై కుట్రపన్ని కేసులో ఇరికించారన్నారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ నాపైనే ప్రయోగించారని, చర్లపల్లి జైలులో 30 రోజుల పెడితే నేను లొంగిపోతానుకుంటే అది కేసీఆర్‌ భ్రమేనని, మిస్టర్‌ కేసీఆర్ 30 రోజుల జైలు జీవితం అవసరమైతే నీ కుటుంబంపై 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తానని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఈ రోజు నుంచి టీఆర్‌ఎస్‌ నేతలకు లాగులు తడుస్తాయన్నారు. రేవంత్‌ జైల్లో ఏడుస్తున్నాడా అని టీఆర్‌ఎస్‌ మంత్రులు అని జైలు అధికారులను అడిగారట అని, నేను స్కామ్‌ ఫైళ్లు చదువుతున్నానని, బయటకు వస్తే మీ పని పడతారని జైలు అధికారులు మంత్రులకు చెప్పారన్నారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి


నిన్న నాకు బెయిల్‌ వస్తే, కేసీఆర్‌కు జ్వరం రావడం మాత్రమే కాదని, లాగు తడుస్తోందన్నారు. తెలంగాణలో టీడీపీ లేకుండా కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నేను ఉన్నా, నా పార్టీ ఉందని, మా కార్యకర్తలు ఉన్నారని, తెలంగాణలో తెలుగుదేశం జెండా ముట్టుకునే మగాడు లేడన్నారు. ఎవరన్నా ఉంటే రా చూసుకుందామని సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

తెలంగాణలో పార్టీకి నేనున్నానని, కార్యకర్తలున్నారని, మా నాయకులున్నారని, కేసీఆర్‌లో ప్రవహించేంది తెలంగాణ రక్తమే అయితే ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న సన్నాసుల చేత రాజీనామా చేయించాలని సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

వారిని తిరిగి ఎన్నికల్లో గెలిపించుకుంటే నాలుగేళ్లు తెలంగాణలో మా పార్టీ జెండా ఎగురవేయమని, అదే టీఆర్‌ఎస్‌ ఓటమిపాలైతే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నేలకు ముక్కురాస్తారా? అంటూ రేవంత్‌ సవాల్‌ విసిరారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

గతంలో టీడీపీని లేకుండా చేస్తానన్నవ్యక్తి 48 గంటల్లో పావురాల గుట్టలో పావురమై పోయాడని పరోక్షంగా వైఎస్‌ను విమర్శించారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

టీవీల్లో టీఆర్‌ఎస్‌ మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నారని, వీళ్లంతా పేరు చెప్పకుండానే.. కేసీఆర్‌కు తందానా అంటున్నారని, వీరిలో ఒక్కరైనా పాత చెప్పుతో సమానంగా ఉన్నారా? అని విమర్శించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

వీరికి మంత్రి పదవులు ఇస్తే ప్రజలకు సేవ చేయటం మాని టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవటానికే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు రూ.7వేల కోట్ల స్కాలర్ షిప్‌లు ఇవ్వలేదని, తెలంగాణలో పది యూనివర్సిటీలు ఉంటే ఒక్క వీసీని కూడా నియమించలేదని, ముందు ముందు వాళ్లను నియమించాలని సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

దుబాయ్‌కి జనాన్ని పంపిస్తానని మోసం చేసినట్లు కేసులు నమోదైతే ఢిల్లీలో ఎమెస్సార్‌ ఇంట్లో దాక్కున్నారంటూ కేసీఆర్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు.

 రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

అలాంటి వ్యక్తి ఇప్పుడు పెద్ద ఉద్యమకారుడా? తెలంగాణ జాతిపితా? వీళ్లు తెలంగాణ తెస్తే బలిదానం చేసుకున్న 1200 మంది విద్యార్థులు ఎవరు? అని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అని నినదించారు.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి


తెలంగాణ మంత్రులపై రేవంత్‌ విరుచుకుపడ్డారు. సన్నాసులు, బద్మా‌ష్‌లు అనే పదాలను ప్రయోగించారు. వారి పేర్లు ప్రస్తావించకుండానే... ఆలుగడ్డలవాడు, గోచి పెట్టుకునేవాడు, అమ్మలాంటి పార్టీని అమ్ముకున్నవాడు, లంబూ అంటూ పరోక్ష విమర్శలు గుప్పించారు. గ్లాసులు మోసే వాళ్లు, మందులోకి సోడా కలిపేవారు మంత్రులుగా ఉన్నారన్నారు.

English summary
Telangana Telugudesam Party MLA A Revanth Reddy and two others, who were granted conditional bail by the High Court of Judicature at Hyderabad on Tuesday, were released from Charlapally central prison here at around 5.30 pm on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X