వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్యూరిటీ లేకుండా ఏటిగడ్డలో అడుగుపెట్టగలరా? : హరీశ్ పై రేవంత్ ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మల్లన్న సాగర్ వివాదం తెలంగాణలో అధికార పక్షానికి ప్రతిపక్షాలకు మధ్య అగ్గి రాజేస్తోంది. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం నాడు అఖిల పక్షం స్వచ్చంద బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. నిర్వాసితులకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, కొద్దిసేపటి క్రితం దుండిగల్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయిన రేవంత్.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. "పోలీసు పహారాలేకుండా మంత్రి హరీశ్‌రావు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో అడుగు పెట్టగలరా..?" అని ప్రశ్నించారు.

ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తే.. విఫలమైందని హరీశ్ ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డ రేవంత్,
ఆఫీసులపై దాడులు చేస్తేనే బంద్ లు సఫలమైనట్లా అని నిలదీశారు. ప్రతిపక్షాల ఆందోళనలను ప్రభుత్వం అవహేళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Warned Harish Rao.. "is he had guts to step in medak with security"

దీనిపై మరింతగా పోరాడతమని చెప్పిన రేవంత్, ప్రభుత్వ చర్యను నిరసిస్తూ.. ఆగస్టు 13, 14 తేదీల్లో ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేస్తామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సమస్యను పరిష్కరించాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారాయన. ఇంతవరకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం ఒక్క నోటీఫికేషన్ కూడా జారీ చేయలేదన్నారు రేవంత్.

హరీశ్ ను అడుగుపెట్టనివ్వం : జగ్గారెడ్డి

మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. మంత్రి హరీశ్ రావును జిల్లాలో అడుగుపెట్టనివ్వం అని హెచ్చిరించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. మన పాలన, మన రాష్ట్రం అని చెప్పిన నేతలు.. రాష్ట్రం వచ్చాక పోలీసులతో ప్రజలను కొట్టిస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ప్రభుత్వం చెబుతున్నట్టు.. భూసేకరణకు 8 గ్రామాల ప్రజలు అంగీకరించాక ఇక రైతులు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు జగ్గారెడ్డి. నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జగ్గారెడ్డి.

English summary
After came out from Dundigal jail TTDP working president Revanth made some firing comments. He Warned Harish Rao.. "is he had guts to step in medak with security"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X