వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసవాళ్లు రెచ్చిపోతున్నారు: శంంకర్ నాయక్ ఘటనపై రేవూరి

|
Google Oneindia TeluguNews

వరంగల్: రాష్ట్రంలో రౌడీ రాజ్యం సాగుతోందని, మంత్రులూ అధికార పార్టీ జ్రాప్రతినిధులూ నాయకులూ తమ మాట వినని అధికారులపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎమ్మెల్యే, శంకర్‌నాయక్‌ మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతిమీనాపై అనుచితంగా ప్రవర్తించినటువంటి సంఘటనలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిపోయాయన్నారు. గత మూడేళ్ల కాంలో అధికారులపై టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వివిధ సందర్భాల్లో దౌర్జన్యాలు, దాడులకు ప్పాడిన సంఘటనలకు సంబంధించిన పత్రిక క్లిప్పింగ్‌లను ప్రకాశ్‌రెడ్డి విలేకరుకు అందజేశారు. ఈ సంఘటనపై సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖను విడుద చేశారు. ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించారు

ఇటువంటి సంఘటలు ఇప్పటి వరకు 27 వరకు జరిగాయన్నారు. మంత్రి హరీష్‌రావు, ఎంపీ కవిత తమకు అనుకూలంగా లేని అధికారులపై ఒంటికాలిమీద లేస్తున్నారన్నారు. పూర్తిగా అణిగిమణిగి ఉన్న ఐఏఎస్‌ అధికారులను సైతం కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Revuri Prakash Reddy deplores Shankar Naik act

సీఎంకు ప్రజాస్వామ్యం అన్నా, ముఖ్యంగా మహిళలు అన్నా విలువ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ జ్రాప్రతినిధులకు, నాయకులకు చట్టం చుట్టంలా మారిందన్నారు. మహబూబాబాద్‌ కలెక్టర్‌ ఉదంతంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై నిర్భయ చట్టం కింద కేసు పెట్టాల్సి ఉండగా అందుకు భిన్నంగా స్టేషన్‌లో రాచమర్యాదు చేసి మరీ బెయిల్‌పై విడుదల చేశారన్నారు.

మహబూబాబాద్‌ కలెక్టర్‌ ఉదంతంలో సీఎం తీసుకున్న చర్యలు భేష్‌గా ఉన్నాయని ఐఏఎస్‌ అధికారుల సంఘం కితాబు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మహబూబాబాద్‌ కలెక్టర్ ఉదంతాన్ని కోర్టు సుమోటోగా తీసుకొని ఎమ్మెల్యేపై చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

English summary
Telugu Desam leader Revuri Prakash Reddy deplored the act of TRS MLA Shanakar Naik at collctor Preethi Meena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X