హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇండికా క్యాష్ ఏటీఎంలో చోరీ, బీదర్ రైలెక్కిన తల్లీకూతుళ్లు అదృశ్యం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా పటాన్‌చెరులోని ఇండికా క్యాష్ ఏటీఎంలో గురువారం చోరీకి యత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ యత్నం జరిగిన పనితీరును పరిశీలించారు.

ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలోనే పటార్‌చెరు ఉండటం, అదే విధంగా పటాన్‌చెరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయా కర్మాగారాలు, కంపెనీలు ఉండడంతో వాటిల్లో పనిచేసేందుకు ఆయా ప్రాంతాల వారు వస్తుంటారు. వీరితో కొంతమంది ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.

బస్టాండ్‌కు అతి సమీపంలోనే పోలీస్‌‌స్టేషన్ ఉన్నా రాత్రి 9 గంటలు దాటితే, ఆకతాయిలు బస్టాండ్ పరిసరాల్లోకి మద్యం సేవించి వచ్చిపోయేవారిపట్ల, బస్టాండ్‌లోని ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇండికా క్యాష్ ఏటీఎంలో చోరీ యత్నాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.

Robbery in indicash atm in patan churu

గ్యాస్‌ నింపుతుండగా ప్రమాదం: ఇద్దరికి తీవ్ర గాయాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో గ్యాస్‌ నింపుతుండగా ప్రమాదం జరిగింది. గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సంజయ్ (8), భూమిక (10) అనే ఇద్దరు చిన్నారులతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

వారిలో సంజయన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన జరిగిన తీరుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తల్లీకూతుళ్ల అదృశ్యం

ఆరు రోజుల క్రితం హైదరాబాదు నుంచి బీదర్ బయలుదేరిన ఇద్దరు తల్లీకూతుళ్లు అదృశ్యమయ్యారు. గత ఆదివారం నాడు కుటుంబ సభ్యులు తల్లి చంద్రకళ, కూతురు నేహాను సనత్ నగర్‌లో బీదర్ రైలుకు ఎక్కించారు.
అయితే ఆ తర్వాత వారు కనిపించలేదు. చంద్రకళ భర్త ప్రసాద్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Robbery in indicash atm in patan churu, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X