వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్లకు మహర్దశ: డెలిగేట్స్‌తో కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో రహదారర్లకు మహర్దశ తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రహదారుల అభివృద్ధి కోసం రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలనుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని , మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లైన్ల రహదారులు నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.

అలాగే అన్ని రహదారులను వెంటనే మరమ్మత్తులు చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు, జాతీయ రహదారుల సిఇ గణపతిరెడ్డి, ఆర్‌అండ్ బి ఇఎన్‌సి పి రవీందర్‌రావు, క్వాలిటీ కంట్రోల్ ఇఎన్‌సి భిక్షపతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా కేంద్రాలనుండి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రోడ్డు ఉందని, కొద్దిపాటి పనులు చేయాల్సి ఉందని, అవి పురోగతిలో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

నిజామాబాద్, ఖమ్మం, రహదారులను నిర్మించాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో డబుల్ లైన్ లేని 149 మండలాలకు- జిల్లా కేంద్రాలకు మధ్య వెంటనే డబుల్ రోడ్లు వేయాలని ఆదేశించారు. తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రూరల్ రోడ్డు డవలప్‌మెంట్ కార్పొరేషన్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బిలో ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామన్నారు. రహదారుల నిర్మాణంలో జాప్యం నివారణకు టెండర్ల విధానంలో మార్పులు చేయనున్నట్టు చెప్పారు.

సాధారణ, చిన్న పనులకు సంబంధించి టెండర్లకు వారం రోజుల గడువు, పెద్ద పనులకు 15 రోజుల గడువు విధిస్తున్నట్టు చెప్పారు. 16వ రోజు వర్క్ అగ్రిమెంట్ చేసుకోవాలని అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రింగురోడ్లు నిర్మించడానికి అవసరం అయిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్ రహదారిని సరి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్ రహదారిని సరిచేయడానికి 750 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో రహదారర్లకు మహర్దశ తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రహదారుల అభివృద్ధి కోసం రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భేటీ అయిన అబుదాబి ప్రతినిధులు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రంలో అన్ని రహదారులను వెంటనే మరమ్మత్తులు చేయాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో రహదారుల పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షించారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో భేటీ అయిన అబుదాబి ప్రతినిధులు.

ప్రజ్ఞాపూర్, కుక్కనూర్‌పల్లి, గౌరా రం, వంటి మామిడిపల్లి, తుర్కపల్లి, దుద్దెడ, ములుగు, కొడకండ్ల, రామునిపట్ల, ఇబ్రహింనగర్ తదితర చోట్ల బైపాస్ రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాజీవ్ రహదారిని ఆదిలాబాద్ జిల్లా చాందారా వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్ వరంగల్ రహదారి ప్రస్తుతం యాదగిరి గుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్డుగా ఉందని, వరంగల్ వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించే పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు స్టేట్ హైవేలు నేషనల్ హైవేలుగా అప్‌గ్రేడ్ అయినందున ఆ పనులు కూడా త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

జగిత్యాల- కరీంనగర్, వరంగల్, కురివి- ఖమ్మం- కోదాడ, నిజాంపేట- నారాయణఖేడ్- బీదర్ రహదారులు జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. తెలంగాణలోని రోడ్ల అధ్యయనంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి రాజయ్య అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ రోడ్లకు సంబంధించి నాలుగు అంశాలపై అధ్యయనం చేసి, రెండు వారాల్లో నివేదిక ఇస్తుంది.

గ్రామీణ, పంచాయితీరాజ్, జాతీయ రహదారులు, అంతర్గత రోడ్లు, ఈ రోడ్ల నిర్మాణానికి ప్రస్తుతం అనుసరిస్తున్న టెండర్ల విధానంపై నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెండర్ల విధానంలోని లోపాలపై కూడా ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. గ్రామీణ రోడ్ల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించడంతోపాటు రాజధాని నగర శివారు ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

English summary
Roads in Telangana will get a major facelift with the state government promising to spend Rs 10,000 crore in the next two years on their development and repair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X