హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోస్టాఫీస్ స్కామ్: సుధీర్ బంధువుల ఇళ్లలో సోదాలు, రూ.70 లక్షలు సీజ్

పోస్టాఫీస్ స్కామ్ కేసులో సిబిఐ అధికారులు సుధీర్ బంధువు నివాసాల నుంచి రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పోస్టాఫీస్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, సీనియర్ సూపరింటిండెంట్ సుధీర్ బాబు బంధువుల ఇళ్ల నుంచి సిబిఐ అధికారులు రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోస్టాఫీసు నుంచి భారీగా అక్రమ మార్గంలో డబ్బు మళ్లించిన కేసులోసుధీర్‌బాబు బంధువుల ఇళ్లలో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.

ఇబ్రహీంపట్నంలోని సుధీర్‌బాబు బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం సోదాలు చేపట్టిన అధికారులు రూ.70లక్షల కొత్తనోట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు పోస్టాఫీసుల్లో రూ.3 కోట్ల మేర పాత నోట్లను అక్రమ పద్దతిలో మార్పిడి చేసినట్లు సుధీర్‌బాబుపై సీబీఐ 3 కేసులు నమోదు చేసింది. నోట్లు మార్చినందుకు కమీషన్‌గా కొత్తనోట్లు తీసుకున్నట్లు సిబిఐ గుర్తించింది.

ఈ కేసులో సిబిఐ అధికారులు కె. సుధీర్ బాబుతో పాటు మరో ఇద్దరు నిందితులు టి. నితిన్ (37), వి నర్సింహారెడ్డిలను అరెస్టు చేసింది. నితిన్ పెండేకంటి లా కాలేజీ విద్యార్థి కాగా, నర్సింహా రెడ్డి ఆస్ట్రేలియా పౌరుడు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు.

Rs 70 lakhs found in Sudhir's relative's house:CBI arrests 2 more in post office scam

నితిన్ సుధీర్ బాబుకు సన్నిహిత మిత్రుడు. వారిద్దరు సివిల్ సర్వీసెస్ ఉద్యోగానికి ప్రిపేరవుతున్నారు. అక్రమ నోట్ల మార్పిడిలో వారిద్దరు సుధీర్ బాబుకు సాయం చేశారు. సుధీర్ బాబు రూ.2.95 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. హిమాయత్‌నగర్, గోల్కొండ, కార్వాన్ సాహు్ సబ్ పోస్టాఫీసుల్లో ఆ అక్రమాలు జరిగాయి.

వారి నుంచి 1702 లక్షల మేరకు కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎడుగురిని అరెస్టు చేశారు. 55 పత్రాలు, కొన్ని ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నరాు. హైదరాబాదులోని 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

English summary
CBI has seized Rs 70 lakhs from the residences of Sudhir Babu's relatives in post office scam case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X