హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొందరు నవ్వారు: గోపీచంద్, మాటలు రావట్లేదు: రజనీకాంత్‌కు సింధు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: మన దేశానికి ఒలింపిక్స్‌లో మెడల్ వస్తుందని చెబితే కొంతమంది నవ్వాని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గపీచంద్ అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొంతమంది హేళన చేసిన దానికి భిన్నంగా మన క్రీడాకారులు రియోలో పతకాలు సాధించారన్నారు.

ముఖ్యంగా పీవీ సింధు రజత పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని గోపీచంద్ అన్నారు. ఒలింపిక్స్‌లో పోటీ పడిన తొలిసారే సింధు ఫైనల్స్‌కు వెళ్లడం, రజతం సాధించడం చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.

పీవీ సింధు 'మన అమ్మాయి': రియో ఒలింపిక్స్ పతకం ఎవరి ఫలితం?పీవీ సింధు 'మన అమ్మాయి': రియో ఒలింపిక్స్ పతకం ఎవరి ఫలితం?

కాగా, శోభా డే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంత డబ్బు పెట్టి ఒలింపిక్స్‌కు వెళ్తే మనవాళ్లు చేసిందేమీ లేదని ఓసారి, సెమీఫైనల్లో పీవీ సింధు గెలిచిన తర్వాత.. ఆమె రజతంతో సరిపెట్టుకుంటుందని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు.

ఇదిలా ఉండగా, రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధు ప్రస్తుతం ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్నారు. రియో నుంచి సోమవారం నాడు హైదరాబాద్ చేరిన సింధును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

ఆ తర్వాత మంగళవారం విజయవాడ వెళ్లిన ఆమెను ఏపీ ప్రభుత్వం కూడా ఘనంగా సన్మానించింది. అనంతరం హైదరాబాదులోని తన సొంతింటికి చేరిన సింధు తనకిష్టమైన ఆహారం తీసుకుంటూ, తన ప్రతిభను కీర్తిస్తూ ప్రముఖులు చేస్తున్న ట్వీట్లకు రీ ట్వీట్లు చేస్తూ ఉత్సాహంగా గడుపుతోందని తెలుస్తోంది.

 Sakshi, Sindhu And Gopichand, All Together

రజనీకాంత్‌కు సింధు సమాధానం

రజతం గెలిచిన పీవీ సింధుకు సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి కూడా అభినందనలు అందాయి. ఈ నేపథ్యంలో పీవీ సింధు సూపర్ స్టార్ ట్వీట్‌కు స్పందంచారు. 'నేను నీకు అభిమానిగా మారిపోయా' అని రజనీ ట్వీట్ చేశారు.

దాంతో ఆనందంతో పీవీ సింధు స్పందిస్తూ.. థ్యాంక్యూ సో మచ్ సర్, మీ ప్రశంసలతో నాకు మాటలు రావడం లేదు, నా ఆనందాన్ని వర్ణించలేని అని రీట్వీట్ చేసింది. కాగా, సింధుకు రజనీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. ఆమె అందరికీ థ్యాంక్స్ చెబుతున్నారు.

గోపీచంద్, పీవీ సింధుతో సాక్షి మాలిక్

రియో ఒలింపిక్స్ ముగింపు రోజుల్లో రజత పతకం సాధించిన పీవీ సింధుతో, ఆమె కోచ్ గోపీచంద్‌తో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ ఫోటో దిగారు. దానిని ఆమె సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

గోపీచంద్‌కు షాక్‌పై అలీ వివరణ, సింధు పరిపూర్ణ క్రీడాకారిణి కాదన్న కోచ్గోపీచంద్‌కు షాక్‌పై అలీ వివరణ, సింధు పరిపూర్ణ క్రీడాకారిణి కాదన్న కోచ్

తాను రియోలో సూపర్ పీవీ సింధు వద్దకు, అలాగే లెజెండ్ గోపీచంద్ వద్దకు పరుగెత్తానని సాక్షి మాలిక్ ట్వీట్ చేసి ఫోటో పెట్టారు. వారిద్దరు నిజమైన ఛాంపియన్లు అని ప్రశంసించారు. సాక్షి ట్వీట్‌కు పలువురు రీట్వీట్ చేశారు. మీరు ముగ్గురు వజ్రాలేనని, పతకం సాధించిన మీకు అభినందనలు అంటూ పెద్ద ఎత్తున రీట్వీట్లు వచ్చాయి.

English summary
"India's pride," "gems of India" and "champion tridev" are just some of the terms Twitter's using to describe this epic picture of India's returning heroes, fresh from their success at the Rio Olympics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X