Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఖైదీల జీవనం చెప్పేందుకు జైలునే మ్యూజియంగా

మెదక్/హైదరాబాద్: జైలు అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలియజెప్పేందుకు తెలంగాణ జైళ్ల శాఖ నడుం బిగించింది. వేలాది మంది ఖైదీలు, నేరస్తులకు పోషణ ఇచ్చిన సంగారెడ్డి జైలు చరిత్ర సుదీర్ఘంగా కొనసాగుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు తరువాత సంగారెడ్డి జైలుదే గొప్ప చరిత్ర! రెండు శతాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని అత్యంత పురాతన జైలును త్వరలోనే మ్యూజియంగా మార్చి ఖైదీల జీవన విధానాన్ని తెలియజెప్పనుంది.

ఒకనాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రస్తుత జైళ్ల శాఖ డిజి వికె సింగ్ సంగారెడ్డిలోని పురాతన కారాగారంపై దృష్టిని కేంద్రీకరించారు. ఈ జైలుకున్న విశిష్టత ఏమిటి? ఎప్పుడు నిర్మించారు? జైలుగా ఎలా మారింది? ఎవరెవరు ఇక్కడ జైలు జీవితాన్ని అనుభవించారు? జైలు పర్యవేక్షణ ఎవరు చేశారనే విషయాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. 1857 సిపాయల తిరుగుబాటుకు ముందే సంగారెడ్డిలో కారాగారాన్ని నిర్మించారు.

సంగారెడ్డికి ఉత్తర దిశలో తాళ్లపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఈ జైలును నైజాం కాలంలో 1796లో డంగు సున్నంతో అత్యంత పటిష్టవంతమైన గోడలతో గుర్రపుశాలగా నిర్మించారు. మొత్తం 4 ఎకరాలకు పైగా జైలుకు స్థలం ఉంది. జైలును మాత్రం 1.22 ఎకరాల్లో నిర్మించారు. గుర్రపుశాల నుంచి జైలుగా ఎప్పుడు మార్చారనే పూర్తి వివరాలు తెలియకపోయినా 1947-48 ప్రాంతంలో సదాశివపేటకు చెందిన కొందరు సత్యాగ్రహం చేయడంతో వారిని ఇక్కడి జైలులో ఉంచినట్లుగా భావిస్తున్నారు.

Sangareddy jail will become museum soon

మొత్తం 9 బ్యారక్‌లు, ఓ మహిళ బ్యారక్‌తో జైలుగా ఏర్పాటు చేశారు. 90 మంది పురుషులు, 5 మంది మహిళా ఖైదీలకు ఆశ్రయం కల్పించే సామర్థ్యంతో ఈ జైలును విస్తరించారు. 218 సంవత్సరాల ఘన చరిత్రను సంతరించుకున్న ఈ జైలు గోడలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. 1882-84 సంవత్సరాల మద్య కాలంలో సర్ సాలార్ జంగ్ నైజాం పోలీసు వ్యవస్థలో ప్రస్తుత డిఐజి ర్యాంక్ హోదాలో డిప్యూటీ అబ్దుల్ అలీం నసరుల్లా నజీం-ఇ-ఫస్‌దారి-ఇ-బల్దాగా వ్యవహరించే వారు.

జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖలు జైలును పర్యవేక్షించేవారు. ఖాజాం జంగ్ అనే కలెక్టర్ నెలకు ఒకసారి జైలును సందర్శించి ఖైదీల కష్ట సుఖాలను తెలుసుకునే వారు. నైజాంల పర్యవేక్షణలో ఉన్న ఇక్కడి జైలుకు 20 మంది భద్రత సిబ్బంది కాపలాగా ఉండే వారు. 1972 సంవత్సరంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి, మల్లయ్యగౌడ్, జైరాంరెడ్డి, పొట్టిపల్లి సోమయ్య తదితరులు కూడా ఈ జైలులో ఉన్నవారే.

పెరిగిన నేరాలు, ఖైదీల సంఖ్యకు ఈ జైలు సరిపోకపోవడంతో అత్యాధునిక సదుపాయాలతో సంగారెడ్డి మండలం కంది గ్రామ శివారులో నిర్మించిన జైలుకు జిల్లా కారాగారాన్ని 5వ తేదీ మే 2012లో మార్చారు. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ జైలును మ్యూజియంగా మారిస్తే సంగారెడ్డికి పర్యాటక శోభ సంతరించుకోవడమే కాకుండా జైలు అంటే ఎలా ఉంటుందో తెలుసుకునే ఔత్సాహికులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతానికి మొదటి విడతగా రూ.14 లక్షలను విడుదల చేసి నీటితో శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించే పనులు చేస్తున్నారు. చంచల్‌గూడ జైలులో శిక్షను అనుభవిస్తున్న పలువురు ఖైదీలను తీసుకువచ్చి శుభ్రపరిచే కార్యక్రమాలను చేపట్టారు. ఖైదీలు ఉన్న బ్యారక్‌లు, స్నానం గదులు, మరుగుదొడ్లు, జైలులో కూడా అల్లరి చేష్టలు చేసే వారికి విధించే కఠినమైన శిక్షకు ఉపయోగించే చీకటి గది, వంటశాల, జైలుకు వచ్చిన ప్రముఖుల ఫొటోల ప్రదర్శన తదితరాలను ఉంచనున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+