వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీలకు కొత్త జిల్లాలు సారథులెవరు: కెసిఆర్ మదిలో ఏముందో...

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: కొత్త జిల్లాలు ఆవిర్భవించాయి. నయా పాలనాధికారులు బాధ్యతలు చేపట్టారు. పాలనా వ్యవహారాలు పక్కాగా సాగుతున్నాయి. ఇక అందరి దృష్టి పార్టీపై పడింది. నూతన జిల్లాలకు వివిధ రాజకీయ పక్షాల రథసారధులెవరనే అన్వేషణ మొదయింది. 2019 ఎన్నికలే లక్ష్యంగా విజయమే పరమావధిగా జిల్లా అధ్యక్షును ఎంపిక చేసే ప్రక్రియకు కసరత్తు జరుగుతోంది.

అధినేతలకు విధేయులు జిల్లాల్లో గుర్తింపు పార్టీని ముందుకు నడిపే సమర్థత ఉన్న నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న వారు, మాజీ అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులు, మాజీ మంత్రువు, నాయకులు పార్టీ స్టీరింగ్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వరంగల్‌ జిల్లాలుగా విడిపోయిన క్రమంలో అవకాశాలు పుష్కలంగా ఉండడంతో పలువురు కొత్త నేతూ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి కొన్ని పార్టీలు ఇప్పటికే శ్రీకారం చుట్టగా, మరికొన్ని పార్టీల్లో కసరత్తు సాగుతోంది.

విధేయులకు పెద్దపీట : జిల్లా అధ్యక్షుల ఎంపికలో విధేయతకే ఆయా పార్టీల అధిష్ఠానం పెద్ద పీట వేయనుంది. ఆశావహుల గత చరిత్ర, వారి సమర్థతతోపాటు పార్టీ పట్ల వారికున్న అభిమానం కొలమానంగా ఎంపికలు జరుగుతున్నాయి. గతంలో ఇతర పార్టీలో పనిచేసి వచ్చిన వారి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. 2019 ఎన్నిక నాటికి వారు మన పార్టీలోనే ఉంటారా అనే కోణంలోనూ తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

ప్రజాప్రతినిధుగా గెలిచినవారి పనితీరుపై సర్వే ద్వారా సమాచారం తెప్పించుకుంటున్న తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే కోణంలో జిల్లా అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందనే కోణంలో సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సైతం అదే అడుగుజాడల్లో పయనిస్తున్నది. 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చి కూడా నష్టపోయామని, 2019 ఎన్నికల్లో విజయం సాధించకపోతే కోలుకోవడం ఇప్పటల్లో సాధ్యంకాదని, అధ్యక్షుల ఎంపికతోనే పార్టీ ప్రస్థానానికి మలుపు తిప్పాలనే దృఢ సంకల్పంతో నేతలున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కంటే తమకే అనుకూల పరిస్థితు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్న కమలదళం కొత్త రథసారధు ఎంపికకు ఇప్పటికే చర్చలు మొదలెట్టింది.

Search for district cheifs for TRS

ఇక తెదేపాది ఘన చరిత్ర 1994లో అవిభక్త వరంగల్‌ జిల్లాలో తెదేపాకు ఒక్క డోర్నకల్‌ మినహా అన్ని సీట్లు వచ్చాయి. అలాంటి రోజు మళ్లీ రావాంటే పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలన్న అధినేత చంద్రబాబు ఆదేశాలను అనుసరించి తెలుగు తమ్ముళ్లు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే నయా జిల్లాకు కొత్త నేత ఎవరనే చర్చకు ముగింపు పలికేందుకు అన్ని పార్టీు స్ధిమవుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ : అర్బన్‌ జిల్లా పీఠం కోసం వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తూర్పు పూర్వ ఇన్‌చార్జి అచ్చ విద్యాసాగర్‌, పార్టీ సీనియర్‌ నేత, గతలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గుడిమళ్ల రవికుమార్‌ పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ప్రదీప్‌రావు ఆయన సోదరుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు బలం తోడవుతుందని అందరూ భావిస్తుండగా అచ్చ విద్యాసాగర్‌కు పార్టీలో మొదటి తరం నాయకుడిగా గుర్తింపు ఉంది. సీఎం కేసీఆరన తనయుడు కల్వకుంట్ల తారకరామారావు మద్దతుతో ఆయన గట్టెక్కుతారని ప్రచారం సాగుతోంది.

గుడిమల్ల రవికుమార్‌కు నేరుగా సీఎం కేసీఆర్‌ వద్దే గుర్తింపు ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వరంగల్‌ గ్రామీణ జిల్లా రేసులో జెడ్పీ మాజీ ఫ్లోర్‌ లీడర్‌, జిల్లా ఫెర్టిలైజర్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్‌రావు పేరు వినిపిస్తోంది. మహబూబాబాద్‌ జిల్లా ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌ అవిభక్త వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు మానుకోట జిల్లా అధ్యక్షుడిగా నియమితులవడం లాంఛనమే అంటున్నారు.

భూపాపల్లి జిల్లా అధ్యక్ష పదవికి ఇద్దరు అగ్రనేత కుటుంబ సభ్యుల మధ్య పోటీ నెలకొంది. స్పీకర్‌ మధుసూదనాచారి తనయుడు ప్రదీప్‌, మంత్రి చందూలాల్‌ తనయుడు ధరమ్‌సింగ్‌లో ఎవరో ఒకరికి దక్కనుంది. జనగామ జిల్లా కిరీటం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్‌ తాటికొండ రాజయ్య శిష్యు రాంబాబు, రాజిరెడ్డిలో ఒకరికి దక్కనుంది.

కాంగ్రెస్‌ : కాంగ్రెస్‌ అధ్యక్షు నియామకంలో ఇప్పటికే ముందంజలో ఉంది. మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా జె. భరత్‌చంద్రారెడ్డి పేరును పార్టీ ఖరారు చేసి రెండు రోజుల క్రితమే ప్రకటించింది. అర్బన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవిలో ప్రస్తుత వరంగల్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నగర మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, ప్రస్తుత అర్బన్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి మధ్య పోటీ ఉంది. గ్రామీణ జిల్లా అధ్యక్షుడి రేసులో ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ బరిలో ఉన్నారు. భూపాపల్లిలో గండ్రజ్యోతి, శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉండగా జనగామ జిల్లాకు డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి, వేము సత్యనారాయణ పేర్లు పరిశృనలో ఉన్నాయి.

బీజేపీ : బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. అర్బన్‌ జిల్లా అధ్యక్ష పదవికి చాడా శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుత అర్బన్‌ అధ్యక్షుడు చింతాకు సునీల్‌, రావు పద్మా అమరేందర్‌ రెడ్డి పోటీ పడుతున్నారు. గ్రామీణ జిల్లా పీఠం కోసం ఎడ్ల అశోక్‌రెడ్డి, శ్రీము మరళీమనోహర్‌,జనగామకు నెల్లుట్ల నర్సింహారావు, భూపాపల్లికి నరహరి వేణుగోపాల్‌రెడ్డి, కీర్తిరెడ్డి పేర్లు పరిశీనలో ఉన్నాయి. మహబూబాబాద్‌కు బానోతు దిలిప్‌నాయక్‌ సోమయ్య పేర్లు పరిశీలిస్తున్నారు.

టీడీపీ : అర్బన్‌ జిల్లా అధ్యక్ష స్థానానికి వేంనరేందర్‌రెడ్డి, రూరల్‌ జిల్లాకు జాతీయ ప్రధాన కార్యదర్శి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఈగమల్లేశం, జనగామకు మాజీ ఎంపీ చాడా సురేష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, భూపాపల్లికి ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ, మహబూబాబాద్‌కు రాంచందర్‌ పేర్లు పరిశీనలో ఉన్నాయి.

పేర్లు ప్రకటించిన సీపీఎం : వామపక్ష పార్టీల్లో పెద్దన్న పాత్ర పోషించే సీపీఎం ఇప్పటికే కొత్త జిల్లా అధ్యక్షు పేర్లు ప్రకటించింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యదర్శిగా సారంపెల్లి వాసుదేవరెడ్డి, గ్రామీణ జిల్లా కార్యదర్శిగా చుక్కయ్య, భూపాపల్లికి సూడి కృష్ణారెడ్డి, మహబూబాబాద్‌కు సాదు శ్రీనివాస్‌, జనగామకు ఉడుత రవి పేర్లు ప్రకటించారు. అయితే వరంగల్‌ అర్బన్‌ జిల్లా, జనగామ జిల్లా కార్యదర్శు ఎంపికపై పార్టీలో భిన్నవాదను వినిపించారు. పునరాలోచించాని అదినాయకుకు అభ్యర్థను వెళ్లినట్లు సమాచారం.

సీపీఐ : భారతీయ కమ్యూనిస్టు పార్టీ కొత్త జిల్లా కార్యదర్శు పేర్లు ప్రకటించేందుకు సిద్ధమయ్యింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు సిరబోయిన కరుణాకర్‌, ప్రసాద్‌, మోతి లింగారెడ్డి, మేక రవి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, గ్రామీణ జిల్లాకు పంజా రమేష్‌, మండ సదాక్ష్మీ, భూపాపల్లికి కె. రాజ్‌కుమార్‌, మామిడా సమ్మిరెడ్డి, మహబూబాబాద్‌కు విజయసారధి, తమ్మెర విశ్వేశ్వరరావు, జనగామకు మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌. రాజిరెడ్డి, టి. సత్యం పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

English summary
Telangana Rastra Samithi (TRS), Congress, Telugu Desam and other political parties are searching for presidents for new districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X