వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతి గౌడ్‌పై సీక్రెట్‌గా: అసలేం జరుగుతోంది? నిజమని తేలితే అంతే!..

శ్రీకాంత్ రెడ్డిపై దాడి తర్వాత ఉన్నతాధికారులకు సైతం ఆమె పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలోను ఆమె ఇలాంటి చర్యలకు పాల్పడిందా? అన్న విషయం తెలుసుకునేందుకు రహస్య విచారణ చేపట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రవాణాశాఖ అధికారిణిగా పనిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ శాఖకు చెందిన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) స్వాతి గౌడ్. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆమెపై రహస్య విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చేయకూడని పనిచేసి.. అడ్డంగా బుక్కైన మహిళా ఆర్టీవో అధికారి!చేయకూడని పనిచేసి.. అడ్డంగా బుక్కైన మహిళా ఆర్టీవో అధికారి!

చలానా విషయంలో తలెత్తిన గొడవతో శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లతో కొట్టించినట్లు స్వాతి గౌడ్ పై ఆరోపణలున్నాయి. మరోవైపు స్వాతి గౌడ్ మాత్రం శ్రీకాంత్ రెడ్డే తనపై విధులకు ఆటంకం కలిగించాడని రివర్స్ కేసు పెట్టింది. స్వాతి గౌడ్ పై శ్రీకాంత్ రెడ్డి పెట్టిన కేసును పట్టించుకోని పోలీసులు.. శ్రీకాంత్ రెడ్డిపై స్వాతి గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం గమనార్హం.

గొడవెందుకు జరిగింది?

గొడవెందుకు జరిగింది?

శనివారం రాత్రి సాగర్ రింగ్ రోడ్డు వద్ద స్వాతి గౌడ్ తన విధులు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ ప్రైవేటు లారీ అటు వైపుగా వచ్చింది. కారణాలేవి స్పష్టంగా తెలియదు గానీ స్వాతి గౌడ్ ఆ లారీకి చలానా రాశారు. దీంతో లారీ ఓనర్ శ్రీకాంత్ రెడ్డికి, ఇన్ స్పెక్టర్ స్వాతి గౌడ్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

శ్రీకాంత్ రెడ్డి ఎదురు మాట్లాడటంతో ఆగ్రహావేశానికి లోనైన స్వాతి గౌడ్.. అతనిపై చేయి చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆపై బౌన్సర్లను పిలిపించి మరీ శ్రీకాంత్ రెడ్డిపై ఆమె దాడి చేయించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటివి కెమెరాల్లో రికార్డవడంతో.. స్వాతిగౌడ్ వ్యవహారం వెలుగుచూసింది.

స్వాతి గౌడ్‌పై ఫిర్యాదు:

స్వాతి గౌడ్‌పై ఫిర్యాదు:

తనపై బౌన్సర్లతో దాడి చేయించినందుకు బాధితుడు శ్రీకాంత్ రెడ్డి పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయాల్సిందిగా కోరాడు. అయితే ఆమె ప్రభుత్వ అధికారిణి కావడంతో, ఉన్నతాధికారులను, కోర్టును సంప్రదించిన తర్వాతే కేసు పెడతామని పోలీసులు చెప్పారు. అదే సమయంలో స్వాతి గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, రాత్రంతా అతన్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఈ విషయం బయటకు పొక్కడంతో స్వాతి గౌడ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు.

స్వాతి గౌడ్‌పై రహస్య విచారణ:

స్వాతి గౌడ్‌పై రహస్య విచారణ:

శ్రీకాంత్ రెడ్డిపై దాడి తర్వాత ఉన్నతాధికారులకు సైతం ఆమె పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలోను ఆమె ఇలాంటి చర్యలకు పాల్పడిందా? అన్న విషయం తెలుసుకునేందుకు రహస్య విచారణ చేపట్టారన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించబోతున్నారని తెలుస్తోంది. నివేదికలో స్వాతి గౌడ్ పై ఆరోపణలు నిజమైనవే అని తేలితే.. ఆమెపై చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది.

ఇష్టమొచ్చినట్లు దూషించిన స్వాతి:

ఇష్టమొచ్చినట్లు దూషించిన స్వాతి:

ఇన్ స్పెక్టర్ స్వాతి గౌడ్ తో తానెంత మర్యాదగా మాట్లాడానో.. ఆమె అంత దారుణంగా మాట్లాడారని శ్రీకాంత్ రెడ్డి వాపోయాడు. ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా తనపై చేయి చేసుకున్నారని తెలిపాడు. తానూ గ్రాడ్యుయేట్ ను అని, అధికారులతో ఎలా మాట్లాడాలో తనకు తెలుసునని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఏ పొరపాటు లేకున్నా చలానా రాసినందుకే వివాదం జరిగిందన్నారు. బౌన్సర్లతో స్వాతి తనపై దాడి చేయించిందని చెప్పాడు.

English summary
According to the reports, A secret enquiry was conducted on MVI Swait Goud, who allegedly beaten a lorry owner at LB Nagar circle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X