హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విహార యాత్రలో విషాదం: బస్సు బోల్తా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ స్కూలు బస్సు బోల్తా పడడంతో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళకరంగా ఉంది. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలోని పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం - మెదక్ జిల్లా పటాన్‌చెరుకు చెందిన సాయితేజ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన దాదాపు వంద మంది విద్యార్థులు శుక్రవారం విహార యాత్రకు వెళ్లారు. పాఠశాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో వేరే పాఠశాలకు చంెదిన మూడు బస్సులను తీసుకుని వెళ్లారు.

బస్సుల్లో విద్యార్థులతో పాటు పది మంది పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. విజయవాడ రోడ్డులోని మౌంట్ ఒపేరా నుంచి వీరు తిరిగి వస్తూ పెద్ద అంబర్‌పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపైకి చేరుకున్నారు. పెద్ద గోల్కొండ రోటరీ జంక్షన్ దాటగానే ఓ బస్సు టైర్ పంక్చర్ అయింది. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది.

స్కూల్ బస్సు బోల్తా

స్కూల్ బస్సు బోల్తా

బోల్తా పడిన బస్సులో దాదాపు 32 మంది విద్యార్థులున్నారు. దాదాపు 15 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

స్కూల్ బస్సు బోల్తా

స్కూల్ బస్సు బోల్తా

గాయపడిన వారిలో విద్యార్థులు హీనా (15), ప్రత్యూష (15) పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గాయపడినవారిని 108 అంబులెన్స్‌లో శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

స్కూల్ బస్సు బోల్తా

స్కూల్ బస్సు బోల్తా

బస్సు అతి వేగమే ప్రమాదానికి కారణమని అంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని, దాంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సేఫ్ గార్డును ఢీకొట్టిందని, దాంతో టైర్ పంక్చర్ అయిందని చెబుతున్నారు.

స్కూల్ బస్సు బోల్తా

స్కూల్ బస్సు బోల్తా

ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల పేర్లు వెల్లడించడానికి ఉపాధ్యాయులు నిరాకరించారు వినోద యాత్రలో విషాదం చోటు చేసుకోవడం వారిని ఇబ్బందికి గురి చేసింది.

స్కూల్ బస్సు బోల్తా

స్కూల్ బస్సు బోల్తా

పెద్ద గొల్కొండ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కనిషన్ సభ్యుడు అచ్యుతరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

స్కూల్ బస్సు బోల్తా

స్కూల్ బస్సు బోల్తా

బస్సు బోల్తా సంఘటనను సూమోటాగా స్వీకరించినట్లు అచ్యుత రావు తెలిపారు. బస్సు అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

స్కూల్ బస్సు బోల్తా

స్కూల్ బస్సు బోల్తా

నిబంధనలకు విరుద్ధంగా విహార యాత్రకు తీసుకెళ్లిన పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి, జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు నోటీసులు జారీ చేసినట్లు అచ్యుతరావు తెలిపారు.

English summary
Several children injued Shamshabad School Bus Accident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X