వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్జే స్టూడియోలో సీసీ కెమెరాలు, వ్యక్తిగతం: శిరీష హత్య, అత్యాచారంపై డిసిపి

బ్యూటీషియన్ శిరీష మృతిపై అన్ని కోణాల్లోను దర్యాఫ్తు జరుపుతున్నామని డిసిపి మంగళవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. శిరీషది ముమ్మాటికి ఆత్మహత్యేనని డిసిపి వెంకటేశ్వర రావు తెలిపారు. ఆత్మహత్యకు సాక్ష్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష మృతిపై అన్ని కోణాల్లోను దర్యాఫ్తు జరుపుతున్నామని డిసిపి మంగళవారం ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. శిరీషది ముమ్మాటికి ఆత్మహత్యేనని డిసిపి వెంకటేశ్వర రావు తెలిపారు. ఆత్మహత్యకు సాక్ష్యాలు ఉన్నాయన్నారు.

<strong>ఎఫ్ఐఆర్‌లో బ్యూటిషియన్ శిరీష కేసులో..</strong>ఎఫ్ఐఆర్‌లో బ్యూటిషియన్ శిరీష కేసులో..

కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏం జరిగిందో నిందితులు రాజీవ్, శ్రవణ్‌లను విచారించి తెలుసుకున్నామని చెప్పారు. శిరీష తన భర్తకు పోలీస్ స్టేషన్ నుంచే లొకేషన్ షేర్ చేసిందని తెలిపారు.

ఫాంహౌస్‌కు వెళ్లినట్లు ఆధారాల్లేవు

ఫాంహౌస్‌కు వెళ్లినట్లు ఆధారాల్లేవు

కుకునూరుపల్లి ఫాంహౌస్‌లోని సిసి కెమెరాలను పరిశీలించామని తెలిపారు. ఫాంహౌస్‌కు వెళ్లిన ఆధారాలు లేవని చెప్పారు. శిరీషతో పాటు మిగతా వారు కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లారన్నారు. వారు ఆ రోజు రాత్రి గం.11.26 నిమిషాలకు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లారని చెప్పారు. ఆ తర్వాత అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చినట్లుగా ఆధారాలు ఉన్నాయని చెప్పారు.

అత్యాచారం జరిగిందా లేదా విచారిస్తున్నాం

అత్యాచారం జరిగిందా లేదా విచారిస్తున్నాం

శిరీషపై అత్యాచారం జరిగిందా లేదా అన్న దానిపై ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు. శిరీష దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు చెప్పారు.

స్టూడియో బెడ్ రూంలో సిసి కెమెరాలు

స్టూడియో బెడ్ రూంలో సిసి కెమెరాలు

ఆర్జే స్టూడియోలో రాజీవ్ సిసి కెమెరాలు ఏర్పాటు చేశాడన్నారు. స్టూడియోలోని కెమెరాలను పరిశీలించామని చెప్పారు. అందులోని ఓ బెడ్ రూంలో రాజీవ్ కెమెరాలు ఏర్పాటు చేశాడని చెప్పారు. అ ఫుటేజీ వ్యక్తిగతమన్నారు. వాటిని కూడా తాము పరిశీలిస్తున్నామని చెప్పారు.

Recommended Video

హత్యకు కుట్ర పన్నాడా లేడా..

హత్యకు కుట్ర పన్నాడా లేడా..

శిరీషను హత్య చేసేందుకు రాజీవ్ కుట్ర పన్నాడా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు నార్త్ జోన్ డిసిపి వెంకటేశ్వర రావు చెప్పారు. ఆ రోజు గొడవకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నామని చెప్పారు. చనిపోవడానికి ముందు గొడవ పడ్డారని చెప్పారు.

మరో ప్రేయసిని విచారించాం

మరో ప్రేయసిని విచారించాం

రాజీవ్ మరో ప్రేయసి తేజస్వినిని కూడా విచారించామని పోలీసులు తెలిపారు. వాళ్ల మధ్య ఉన్న గొడవలను ఆ అమ్మాయి చెప్పిందని డిసిపి తెలిపారు. నిందితుల కస్టడీ పూర్తయ్యాక కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

English summary
West Zone DCP Venkateswara Rao on Tuesday said that beautician Sirisha was committed suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X