హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే శిరీషను చంపేశారు, ఈ ప్రశ్నలకు సమాధానమేదీ?: తల్లి నిలదీత

తమ కూతురు శిరీష(విజయలక్ష్మి)ది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి అన్నారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ఆచంట: తమ కూతురు శిరీష(విజయలక్ష్మి)ది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి అన్నారు. శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తెలిపారు. హైదరాబాద్‌లో కమిషనర్ మహేందర్ రెడ్డి శిరీష ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను తెలిపిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఆ రాత్రి క్వార్టర్‌లో ఏం జరిగింది? రెండు గంటలపాటు ఒకే గదిలో శిరీష, ప్రభాకర్ రెడ్డి?ఆ రాత్రి క్వార్టర్‌లో ఏం జరిగింది? రెండు గంటలపాటు ఒకే గదిలో శిరీష, ప్రభాకర్ రెడ్డి?

ఆ ముగ్గురే కారణం

ఆ ముగ్గురే కారణం

శిరీష చాలా ధైర్యవంతురాలని ఆమె తల్లి తెలిపింది. తమ కూతురుకు ఎవరితోనూ సంబంధం లేదని, అలాంటి పనులు చేయదని తెలిపారు. శిరీష మరణానికి రాజీవ్, ప్రభాకర్ రెడ్డి, శ్రవణ్‌లే కారణమని ఆమె ఆరోపించారు.

శారీరక సంబంధాలు, శిరీషపై ఎస్ఐ అత్యాచారయత్నం: ఇది సిపి మాటశారీరక సంబంధాలు, శిరీషపై ఎస్ఐ అత్యాచారయత్నం: ఇది సిపి మాట

ఈ ప్రశ్నలకు సమాధానమేది?

ఈ ప్రశ్నలకు సమాధానమేది?

తమ కూతురును చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నిందితులు నాటకాలాడుతున్నారని ఆరోపించారు. శిరీష సుమారు 80కిలోలు ఉంటుందని, అంత బరువు ఫ్యాన్ ఎలా ఆపుతుందని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ శిరీష ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. తమకు మెసేజ్ అయినా పెట్టేది కదా? అని నిలదీశారు.

అందుకే చంపేశారు

అందుకే చంపేశారు

శిరీష మెడపై వైరు అచ్చులు ఉన్నాయని, వారుతో నిందితులే చంపేశారని అన్నారు. ప్రభాకర్ రెడ్డి లైంగిక దాడికి యత్నిస్తుంటే శిరీష ప్రటిఘటించిందని ఆమె చెప్పారు. నిందితులు తాము చేసిన కుట్ర బయటపడుతుందనే ఉద్దేశంతోనే శిరీషను చంపేశారని ఆమె తల్లి ఆరోపించారు.

డీజీపీకి ఫిర్యాదు చేస్తాం

డీజీపీకి ఫిర్యాదు చేస్తాం

ఘటనపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. తేజశ్వి గురించి తేలియదని చెప్పారు. పోలీసులు తేజశ్వి ఆత్మహత్య చేసుకుందని చెప్పారని, మిగితా విషయాలు తనకేమీ తెలియదని శిరీష భర్త తెలిపారు. తన భార్య మరణం తనను తీవ్రంగా బాధిస్తోందని, ఇప్పుడేం మాట్లాడలేనని శిరీష భర్త సతీష్ చంద్ర తెలిపారు.

English summary
Sirisha's Mother on Friday said that has murdered, says her mother
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X