వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారులో శిరీష లెంపలెందుకు వేసుకుంది?: కాఫీ షాప్‌లో రాజీవ్-శ్రవణ్ వేసిన స్కెచ్ ఏంటి?

శిరీష అడ్డు తొలగించుకోవడానికి బంజారాహిల్స్ రోడ్ నం.10లోని కప్పా కాఫీ షాప్ కు వెళ్లి, అక్కడ మూడు గంటల పాటు ఇదే విషయంపై ఆలోచించామని రాజీవ్, శ్రవణ్ లు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దాదాపు రెండు వారాలుగా అటు మీడియాలోను, ఇటు జనంలోను తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న బ్యుటీషియన్ శిరీష కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతూనే ఉంది. రోజుకో కొత్త అనుమానం తెర పైకి వస్తుండటంతో.. కేసులో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చెప్పలేని పరిస్థితి.

నిందితులు రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు తాజాగా కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో.. శిరీష అనుమానాస్పద మృతి కేసు మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కస్టడీలో రాజీవ్, శ్రవణ్ సంచలన విషయాలేమైనా చెబుతారా? శిరీషది హత్యే అన్న సంచలన నిజాలేమైనా బయటకు వస్తాయా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

<strong>ట్విస్ట్ ల మీద ట్విస్ట్: శిరీష, తేజస్విని వదిలించుకోవాలని, పెళ్ళి కోసమే ఇలా..</strong>ట్విస్ట్ ల మీద ట్విస్ట్: శిరీష, తేజస్విని వదిలించుకోవాలని, పెళ్ళి కోసమే ఇలా..

ఆమెది ఆత్మహత్యేనని తొలుత నిర్దారించినప్పటికీ.. విచారణలో వెల్లడైన విషయాలు పలు సందేహాలకు తావివ్వడంతో.. నిందితులిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ నిమిత్తం వీరిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

10కోణాల్లో నిందితుల విచారణ:

10కోణాల్లో నిందితుల విచారణ:

రిమాండ్ లో బయటకొచ్చిన విషయాలు.. శిరీష కేసులోని కొన్ని అనుమానాలకు స్పష్టతనివ్వకపోవడంతో పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. ముఖ్యంగా శిరీష మృతి తర్వాత ఆడియో టేపులు ఎలా లీకయ్యాయి? అందులో శిరీషతో మాట్లాడిన నందు, నవీన్ ఎవరు? తేజస్విని-శిరీషలలో ఎవరిని వదిలించుకోవడానికి రాజీవ్ ప్లాన్ వేశాడు?, మొత్తం గొడవలో తేజస్విని పాత్ర ఏంటి? వంటి ప్రశ్నలపై పోలీసులు ఆరా తీయనున్నారు.

నందు గురించి రాజీవ్ మాట:

నందు గురించి రాజీవ్ మాట:

విచారణలో భాగంగా.. నందు ఎవరనే దాని గురించి రాజీవ్ ను ప్రశ్నించగా.. అతని గురించి తనకేమి తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. బహుశా శిరీష ఫ్రెండ్ అయి ఉండవచ్చు అని కూడా అతను సమాధానం చెప్పాడు. దీంతో అసలు ఈ నందు ఎవరో కనుక్కునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

శిరీష లోదుస్తులపై మరకలు కనిపించడం.. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటాడా? అన్న అనుమానాలు కేసు చుట్టు ముసురుకోవడంతో.. శిరీషపై అత్యాచారం జరిగిందా? అన్న కోణంలోను పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

కారులో లెంపలేసుకుంది:

కారులో లెంపలేసుకుంది:

శిరీష పట్ల ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ప్రవర్తన గురించి తాజాగా రాజీవ్, శ్రవణ్ పలు ఆసక్తికర నిజాలు వెల్లడించారు. శిరీషను ఎస్ఐ గదిలో వదిలి తాము బయట నిలబడి ఉన్నప్పుడు.. ఆమె కేకలు వినపడగానే కాస్త తలుపు తెరిచి చూశామని, ఆ సమయంలో ఎస్ఐ శిరీషపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఒప్పుకున్నారు.

ఆ వెంటనే తలుపు తీసుకుని తాము లోపలకు వెళ్లామని, కానీ కోపంతో తమను బయటకు పంపించేశాడని నిందితులు తెలిపారు. ఎస్ఐ ప్రవర్తన శిరీషను బాగా కుంగదీసిందని, తిరిగి హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా పలుమార్లు ఆమె లెంపలేసుకుందని చెప్పడం గమనార్హం.

కొట్టింది నిజమే, కాఫీ షాప్ లో స్కెచ్:

కొట్టింది నిజమే, కాఫీ షాప్ లో స్కెచ్:

హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన సమయంలో.. కారులో పలుమార్లు శిరీషను కొట్టిన మాట వాస్తవమేనని రాజీవ్ అంగీకరించాడు. ఇదిలా ఉంటే, రాజీవ్‌కు తెలియకుండా తాను, శిరీష తరుచూ కలుస్తుండేవారమని శ్రవణ్ పేర్కొనడం గమనార్హం. కాగా, గత నెల 30న రాజీవ్ ప్రియురాలు తేజస్విని ఆర్జే ఫోటో స్టూడియోకి వచ్చి శిరీషను హెచ్చరించినట్లు చెబుతున్నారు.

రాజీవ్ తో సంబంధం నేపథ్యంలో.. శిరీష అంతుచూస్తానంటూ ఆమె బెదిరించిందని తెలుస్తోంది. ఆ తర్వాత శిరీష అడ్డు తొలగించుకోవడానికి బంజారాహిల్స్ రోడ్ నం.10లోని కప్పా కాఫీ షాప్ కు వెళ్లి, అక్కడ మూడు గంటల పాటు ఇదే విషయంపై ఆలోచించామని రాజీవ్, శ్రవణ్ లు తెలిపారు.

అయితే అక్కడ ఏం చర్చలు జరిపారు? శిరీషను చంపేయాలని ప్లాన్ ఏమైనా వేశారా? లేక ఆమెను వ్యభిచారిణిగా చిత్రీకరించాలనుకున్నారా?.. అసలు కాఫీ షాప్ లో ఏం స్కెచ్ వేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఏదేమైనా నిందితులు ఇద్దరు కస్టడీలో ఉండటంతో.. శిరీష కేసులో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం లేకపోలేదు.

English summary
A number of questions which remained unanswered in Sirisha’s suicide case have forced the investigating police officers to take the two accused, Rajiv and Sravan, into custody again for two days for questioning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X