వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ వదలొద్దు: శ్యాంకు సిట్, సహకరిస్తే సరే.. సినీస్టార్స్‌కు హెచ్చరిక

డ్రగ్స్ వ్యవహారంలో రెండో రోజు కెమెరామెన్‌ శ్యామ్ కె నాయుడిని సిట్‌ అధికారులు గురువారం ఐదున్నర గంటల పాటు విచారించారు. ఉదయం తన లాయర్, కొద్దిమంది సన్నిహితులతో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయాని

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో రెండో రోజు కెమెరామెన్‌ శ్యామ్ కె నాయుడిని సిట్‌ అధికారులు గురువారం ఐదున్నర గంటల పాటు విచారించారు. ఉదయం తన లాయర్, కొద్దిమంది సన్నిహితులతో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ఆయన వచ్చారు.

కెల్విన్‌తో సంబంధాలపై ఆరా

కెల్విన్‌తో సంబంధాలపై ఆరా

దీంతో సిట్‌ అధికారుల బృందం ఈ ఉదయం 10.30 గంటల నుంచి పలు దఫాలుగా విచారించారు. డ్రగ్స్‌ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఉన్న సంబంధాలపైనే ఆరా తీశారని తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు విచారించిన అధికారులు ఆయన ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది.

Recommended Video

Pawan Kalyan Seeks Chandrababu Naidu Appointment
స్పష్టమైన సమాధానాలు చెప్పలేదా?

స్పష్టమైన సమాధానాలు చెప్పలేదా?

కెల్విన్‌ ముఠాకు సంబంధించిన వివరాలు, డ్రగ్స్ కెల్వినే సరఫరా చేసేవాడా? లేదంటే దళారులతో సరఫరా చేసేవాడా? లాంటి ప్రశ్నల్ని అడిగారని సమాచారం. విచారణ ముగిసిన అనంతరం శ్యామ్‌ కె నాయుడు సిట్‌ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే, కెల్విన్‌తో ఇతరులకు ఉన్న సంబంధాలపై ఆయన స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. కాగా అనుమతి లేకుండా హైదరాబాద్ వదలొద్దని అధికారులు ఆయనకు చెప్పారు.

పూరీని ట్రీట్ చేసినట్లే..

పూరీని ట్రీట్ చేసినట్లే..

బుధవారం దర్శకులు పూరీ జగన్నాథ్‌ను ట్రీట్ చేసినట్లే సిట్ అధికారులు శ్యామ్ కె నాయుడును ట్రీట్ చేశారని తెలుస్తోంది. ఇతను డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడే తప్ప, విక్రయదారుడు కాదని గుర్తించారని తెలుస్తోంది. డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకోవడం మానేశారని సిట్ అధికారులు శ్యాంను అడిగారని తెలుస్తోంది.

ఆషామాషీ కేసు కాదు

ఆషామాషీ కేసు కాదు

డ్రగ్ కేసు ఆషామాషీ కేసు కాదని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అన్నారు. నోటీసులు అందుకున్న వారు సిట్ విచారణకు హాజరైతే దర్యాఫ్తు వేగవంతమవుతుందన్నారు. డ్రగ్ కేసును చాలా లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఆధారాలు లభిస్తే ఎవరి పైన అయినా చర్యలు అన్నారు.

కొరియర్ సంస్థలతో సమావేశం

కొరియర్ సంస్థలతో సమావేశం

శ్యామ్ కె నాయుడు విచారణకు సహకరించారని సిట్ అధికారులు వెల్లడించారు. ఈవాళ మూడు కొరియర్ సంస్థలతో సమావేశమయ్యామని తెలిపారు. డ్రగ్స్ డెలివరీని అరికట్టాలని చెప్పామన్నారు. ఆరుగురితో కూడిన సిట్ బృందం శ్యామ్ కె నాయుడిని ప్రశ్నించిందన్నారు.

English summary
SIT (Special Investigation Team) Interrogated Cinematographer Shyam K Naidu on Thursday in Drug case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X