హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టాలీవుడ్‌కు 'డ్రగ్స్' కష్టాలు: ఆ గంటే కీలకం, చార్జీషీట్‌లో ఎవరెవరు?

సిట్ విచారణను ఎదుర్కొన్నవారందరి పేర్లను చార్జీషీట్లలో పొందుపర్చే అవకాశాలున్నట్టుగా ఎక్సైజ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులకు సహకరిస్తే వెసులుబాటును ఇచ్చే అవకాశం.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిట్ విచారణను ఎదుర్కొన్నవారందరి పేర్లను చార్జీషీట్లలో పొందుపర్చే అవకాశాలున్నట్టుగా ఎక్సైజ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారులకు సహకరిస్తే వెసులుబాటును ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్‌కు చార్మి కౌంటర్పర్సనల్ విషయాలు మీకెందుకు?: సిట్‌కు చార్మి కౌంటర్

డ్రగ్స్ కేసు హైద్రాబాద్ నగరాన్ని వణికిస్తోంది. ఈ వ్యవహరం ప్రస్తుతం సినీ రంగాన్ని చుట్టుముట్టింది. సినీ ప్రముఖులు రోజుకొకరుగా సిట్ అధికారుల ముందుకు వస్తున్నారు.

కెల్విన్ ఎలా పరిచయం: చార్మికి సిట్ ప్రశ్నల వర్షం?కెల్విన్ ఎలా పరిచయం: చార్మికి సిట్ ప్రశ్నల వర్షం?

టాలీవుడ్ నటుడు రవితేజ విచారణతో సినీ ప్రముఖుల విచారణ తొలి దశ పూర్తయ్యే అవకాశం ఉంది . అయితే ఇప్పటివరకు విచారించిన ప్రముఖులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని విచారించేందుకుగాను సిట్ అధికారులు ప్రయత్నాలను చేస్తున్నారు.

అయితే ఈ కేసులో ఇంకా ప్రధానంగా ఎవరెవరున్నారనే విషయమై నిర్ధారణకు వచ్చిన తర్వాత అరెస్టులు కూడ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే సినీ ప్రముఖుల అరెస్టుల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఒక్కగంటతోనే సీన్ మారింది

ఒక్కగంటతోనే సీన్ మారింది

బోయిన్‌పల్లిలో కెల్విన్ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్ సమయంలో ఎక్సైజ్ అధికారులు విస్తుపోయారు. కెల్విన్ ఉంటున్న ఇంట్లో మోతాదుకు మించిన డ్రగ్స్‌తో పాటు కెల్విన్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఈ విషయం తెలుసుకొన్న అకున్ సబర్వాల్ స్టేషన్‌కు చేరుకొని విచారణ చేస్తే డ్రగ్స్ సినీ ప్రముఖులతో లింకులు వెలుగుచూశాయి.

Recommended Video

Kajal Aggarwal, Raashi Khanna And Lavanya Tripathi Names In Drugs Scandal
చార్జీషీట్లో విచారణకు వచ్చినవారి పేర్లు

చార్జీషీట్లో విచారణకు వచ్చినవారి పేర్లు

సిట్ విచారణకు హజరైన వారందరి పేర్లను చార్జీషీట్లో పొందుపర్చనున్నట్టుగా అధికారవర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. సాక్షులు, నిందితులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పేరును చార్జీషీట్‌లో పేర్లను చేర్చే అవకాశం లేకపోలేదు.ఇప్పటికే ఈ కేసు విచారణ సంచలనంగా మారింది. సిట్ విచారణకు సినీ ప్రముఖులు వరుసపెట్టారు. విచారణలో సినీ ప్రముఖుల పేర్లను విచారణకు వచ్చినవారు బయటపెడుతున్నారని ఎక్సైజ్ అధికారులు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా రెండు రోజుల క్రితం బయటపెట్టారు. దీన్ని బట్టి చూస్తే ఇంకా విచారణలు కొనసాగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు.

పక్కా ఆధారాల సేకరణ

పక్కా ఆధారాల సేకరణ

సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామిక రంగం ఉన్నతాధికారుల పిల్లలను త్వరలోనే ఎక్సైజ్ అధికారులు విచారించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. కొందరు బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన లావాదేవీలను ఇప్పటికే సేకరించినట్టు సమాచారం. దందాలో కీలకంగా వ్యవహరించిన వారిని అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

అఫ్రూవర్‌గా మారితే సానుకూలం

అఫ్రూవర్‌గా మారితే సానుకూలం

డ్రగ్స్ కేసులో తమ వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు ఇచ్చేందుకు సిద్దపడితే అఫ్రూవర్‌గా మారితే అధికారులు కొంత సానుకూలంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని ఎక్సైజ్ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. డ్రగ్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాత్రను నిర్ద్వంద్వంగా నిరూపించేందుకు అవసరమైన అన్ని చర్యలను ఎక్సైజ్ అధికారులు తీసుకొంటున్నారు.

ఆడియో, వీడియో, వాట్సాప్ మేసేజ్‌ల ఆధారాలు

ఆడియో, వీడియో, వాట్సాప్ మేసేజ్‌ల ఆధారాలు

ఆడియో, వీడియో, వాట్సాప్ టెక్ట్స్ మేసేజ్‌లు, పోన్ కాల్స్ లిస్ట్ ఆధారాలను సేకరించారు.అయితే విచారణలో తాము సేకరించిన ఆధారాలను ధృవీకరించుకొనేందుకు విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణ సందర్భంగా కూడ ఇంకా కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారితో పాటు విచారణకు వచ్చిన వారికి ఈ కేసులతో ఉన్న సంబంధాలపైనే సిట్ అధికారులు కేంద్రీకరించారు.

సిడీల్లో విచారణ వాంగ్మూలం

సిడీల్లో విచారణ వాంగ్మూలం

సిట్ అధికారుల ముందుకు వచ్చిన ప్రముఖుల విచారణను ఆద్యంతం వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. సిట్ కార్యాలయానికి వచ్చిన సమయం నుండి విచారణ పూర్తయ్యే వరకు రికార్డింగ్ చేస్తున్నారు.అయితే బయటి వ్యక్తుల సమక్షంలో ఈ వీడియోలను సీజ్ చేస్తున్నారు. ఎలాంటి టాంపరింగ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.ఈ వీడియోలను విచారణ పూర్తైన సమయంలో ఎలా భద్రపరిచారో అదేరీతిలో కోర్టులో సమర్పించనున్నారు.

English summary
SIT officials planning to file chargesheet soon.excise officials will enquiry more celebrities.SIT officials will submit to court recorded video evidence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X