వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల పోరాటం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు: ఉత్తమ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

కామారెడ్డి :విధ్యార్థులు చేసిన పోరాటం వల్లే కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి దక్కిందని చెప్పారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.విధ్యార్థుల పోరాటాన్నికెైసిఆర్ మరిచిపోయారని ఆయన ఆరోపించారు..

కామారెడ్డి లోని తాహెర్ గార్డెన్ లో శుక్రవారం నాడు జరిగిన విధ్యార్థి పోరు గర్జన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.కెసిఆర్ అనుసరిస్తోన్న విధానాల కారణంగా 3200 ఇంజనీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు ఉత్తమ్.

uttamkumar reddy

పీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిల కోసం కళాశాలల యాజమాన్యాలు పోరాటానికి ముందుకు రావాలని ఆయన కోరారు. పీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలను వెంటను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కెసిఆర్ పాలనను ఆయన తప్పుబట్టారు. తన ఇష్టానుసారం పాలనను సాగిస్తున్నారని ఆయన సిఎం వ్యవహరిస్తోన్న తీరును ఆక్షేపించారు.ఉద్యమం సమయంలో విద్యార్థులు చేసిన పోరాటాలను సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈ పోరాటాన్ని తనకు సిఎం పదవి వచ్చేలా మలుచుకొన్నారని ఆయన విమర్శించారు.

English summary
students separate state struggle turn to kcr become cm said pcc chief uttamkumar reddy. nsui conduct a meeting on friday at kamareddy function hall vidyarhi poru garjana.uttam participated in meeting as a chief guest.kcr forget students struggle said uttam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X