హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నిర్మిస్తా: కెటిఆర్‌తో సుభాష్ ఘాయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్ సోమవారంనాడు ప్రకటించారు. తెలగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఇతర మంత్రులతో సచివాలయంలో సుభాష్ ఘాయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ ఇనిస్టిట్యూట్‌కు సంబంధించిన ప్రణాళికపై చర్చించారు.

సినీ రంగంలో స్థానిక యువకులకు అవకాశాలు దక్కేలా, వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకుని వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సుభాష్ ఘాయ్‌కి మంత్రి కెటిఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సుభాష్ ఘాయ్ అన్నారు.

రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ మేరకు తమ వద్ద ఉన్న ప్రణాళికను వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... సినిమా, వినోద రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు.

ప్రభుత్వం తలపెట్టిన గేమింగ్ సిటీలో భాగస్వాములు కావాలని సుభాష్ ఘాయ్‌ని కోరారు. రాచకొండ వద్ద అంతర్జాతీయస్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో చేపట్టనున్న ఫిల్మ్ సిటీ గురించి వివరించిన కెటిఆర్.... అక్కడ సుభాష్ ఘాయ్ సంస్థ విజిలింగ్ ఉడ్స్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు.

Subhash Ghai Revives Proposal to Set up Film Institute in Hyderabad

ఈ ప్రతిపాదన పట్ల సుభాష్ ఘాయ్ స్పందిస్తూ... గేమింగ్ సిటీలో అనేక అవకాశాలుంటాయని, అలాంటి రంగంలో తమను భాగస్వాములు కావాలని ఆహ్వానించడం సంతోషమన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక వసతులు సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడుతాయన్నారు. తన సంస్థ ముక్తా ఆర్ట్స్ ద్వారా ఇక్కడి పరిశ్రమకు మరిన్ని సేవలు అందిస్తామని సుభాష్ ఘాయ్ చెప్పారు.

English summary
Subhash Ghai Revives Proposal to Set up Film Institute in Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X