వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్లు తిరిగాయని వెళ్తే కాళ్లు, చేతులు తీసివేశారు

వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఓ అమ్మాయి కాళ్లు, చేతులను తొలగించారు వైద్యులు. నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకొందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.అయితే ప్రాణాలకు ప్రమాదం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్ :కళ్లు తిరిగాయని ఆసుపత్రికి వెళ్తే కాళ్లు, చేతులు తీసివేశారు ఓ కార్పోరేట్ ఆసుపత్రి యాజమాన్యం. తమ కూతురి కాళ్లు, చేతులు తీసివేయడానికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.అయితే ఈ ఘటనపై బాధితులు హెచ్ ఆర్ సి ని ఆశ్రయించారు. మరో వైపు బాధితురాలి ప్రాణానికి ప్రమాదమని భావించే కాళ్లు, చేతులను తొలగించామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.

ఆసుపత్రిలో వైద్యం కోసం వెళ్తే ప్రాణాలకు ముప్పు ఏర్పడింది.అయితే కాళ్లు, చేతులు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి తీరుపై బాదితురాలి కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు.

ఆసుపత్రి యాజమాన్యాల వైఖరిని బాధితురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రాణాలకు ప్రమాదం ఉందనే భావించడంతోనే కాళ్లు, చేతులు తొలగించాల్సిన పరిస్థితి నెలకొందని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.

తమ కూతురికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధితురాలి కుటుంబసభ్యులు హెచ్ ఆర్ సి ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

వైష్ణవికి అసలేం జరిగింది

వైష్ణవికి అసలేం జరిగింది

మౌలాలిలోని హనుమాన్ నగర్ కు చెందిన వైష్ణవి కళ్లు తిరిగి పడిపోయింది.అయితే కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు.అక్కడే వైష్ణవికి రక్తం ఎక్కించారు.ఆమెకు రక్తం ఎక్కించే సమయంలోనే చేతులు నల్లగా కమిలిపోయి శరీరమంతా భరించలేని మంటతో ఇబ్బందిపడింది. మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రికి తరలించారు.

 నిర్లక్ష్యంగా వైద్యం చేశారు. వైష్ణవి కుటుంబ సభ్యులు

నిర్లక్ష్యంగా వైద్యం చేశారు. వైష్ణవి కుటుంబ సభ్యులు

వైష్ణవికి వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్లే ఆమెకు కాళ్లు, చేతులు తీసివేయాల్సి వచ్చిందని వైష్ణవి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.తమకు ఎలాంటి సమాచారం లేకుండానే తమ కూతురు కుడిచేయిని తొలగించారని ఆరోపిస్తున్నారు.బలవంతంగా తమతో సంతకాలు చేయించుకొన్నారని వారు ఆరోపిస్తున్నారు.

హెచ్ ఆర్ సి ని ఆశ్రయించిన కుటుంబసభ్యులు

హెచ్ ఆర్ సి ని ఆశ్రయించిన కుటుంబసభ్యులు

తన కూతురుకు న్యాయం చేయాలని వైష్ణవి కుటుంబసభ్యులు శనివారం నాడు హెచ్ ఆర్ సి ని ఆశ్రయించారు. రూ.20 లక్షల రూపాయాలను చెల్లించాలని లేకపోతే చికిత్సను నిలిపివేస్తామని కార్పోరేట్ ఆసుపత్రి యాజమాన్యం చెబుతోందని, ఈ కారణంగా తన కూతురుకు న్యాయం చేయాలని కోరారు.పోలీసులకు వైద్యులపై నాచారం పోలీసులకు వైష్ణవి తండ్రి సుధాకర్ ఫిర్యాదుచేశాడు.

 ప్రాణాలకు ప్రమాదమనే తొలగించాల్సి వచ్చింది.

ప్రాణాలకు ప్రమాదమనే తొలగించాల్సి వచ్చింది.

వైష్ణవి ఎనీమియాతో బాదపడుతోంది. అప్పటికే ఆమెను మూడు ఆసుపత్రుల్లో చూపించారు.ఆయా ఆసుపత్రుల్లో కూడ రక్తం ఎక్కించారు.ఏ ఆసుపత్రిలో ఎక్కించిన బ్లడ్ ద్వారా ఇన్ ఫెక్షన్ సోకిందో తెలియడం లేదన్నారు. తమ ఆసుపత్రికి తీసుకువచ్చే నాటికి ఆమె తీవ్ర ఇన్ ఫెక్షన్ తో బాదపడుతోదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.ఇన్ ఫెక్షన్ సోకిన ప్రాంతాలను తొలగించకపోతే ప్రాణాలకే ప్రమాదమని భావించి వాటిని తొలగించాల్సి వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.వైష్ణవి కుటుంబసభ్యుల ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు.అయితే ఆసుపత్రి బిల్లు 19 లక్షలు అయితే కేవలం నాలుగు లక్షలు మాత్రమే చెల్లించారని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.

English summary
sudhar complient in hrc against corporate hospital in hyderabad.sudharkar's daugther vaishnavi under treatment in corporate hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X