వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష్యం 5వ స్థానం: స్వచ్ఛ స్వరేక్షణ్‌ 2017కు సన్నద్ధం

‘స్వచ్ఛ స్వరేక్షణ్‌-2017లో 500 పట్టణాల మధ్య పోటీ జరుగనుంది. ఈసారి వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ఐదోస్థానంలో నిలవాలి. ఈ దిశగా తక్షణం ప్రజారోగ్య విభాగం రంగంలోకి దిగాలి.

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: 'స్వచ్ఛ భారత్‌ అమలుపై కేంద్ర ప్రభుత్వం నిరుడు దేశవ్యాప్తంగా 75 పట్టణాల మధ్య పోటీ నిర్వహించింది. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ 33వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ స్వరేక్షణ్‌-2017లో 500 పట్టణాల మధ్య పోటీ జరుగనుంది. ఈసారి వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ఐదోస్థానంలో నిలవాలి. ఈ దిశగా తక్షణం ప్రజారోగ్య విభాగం రంగంలోకి దిగాలి. ఇందుకు కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తాం. జాతీయ స్థాయిలో ఓరుగల్లు మహా నగరం ఐదో స్థానంలో నిలివాలి' అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

గతం ఘనం..

2013 క్లీన్‌సిటీ ఛాంపియన్‌షిప్‌ కార్యక్రమంలో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ జాతీయస్థాయిలో నెంబర్‌వన్‌గా నిలిచింది. మూడేళ్లలో పరిస్థితి తారుమారైంది. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. మహానగరంలో చెత్తమయంగా మారింది. కాజీపేట, హన్మకొండ, వరంగల్‌ త్రినగరాల్లో ఏ రోడ్డులో చూసిన చెత్తే దర్శనమిస్తుంది. ఇంటింటి చెత్త సేకరణ క్రమం తప్పింది. ఈ విషయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కీేఆర్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నగరపాలక స్వరేక్షణ్‌-2017లో వరంగల్‌ మహా నగరపాలక సంస్థ ఐదోస్థానంలో నిలవాలని లక్ష్యంగా నిర్ణయించారు ఈ దిశగా సమగ్ర ప్రణాళిక రూపొందింకుని ముందుకు సాగాలని ఆదేశించారు. ఇందుకు కావాల్సిన యంత్రాలు వారం రోజుల్లో పంపిస్తానని హామీ ఇచ్చారు. స్వచ్ఛ స్వరేక్షణ్‌ గ్రేటర్‌ వరంగల్‌కు పెను సవాల్‌గా మారింది. మరో రెండు నెలల గడువే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందం 2017 జనవరిలో రానుంది.

ఇంటింట చెత్త సేవకరణకు బ్యాటరీ వాహనాలు

వందశాతం లక్ష్యం: మహా నగరంలో ఇంటింటి చెత్తసేకరణను బలోపేతం చేసేందుకు కొత్తగా 200 బ్యాటరీతో నడిచే వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక అవి ఒక్కోటి 300-400 ఇళ్లకెళ్తుంది. దాదాపుగా లక్షల ఇళ్లను కవర్‌చేసే సామర్థ్యం ఉంటుంది. ఇంటింట చెత్త సేకరణ వందకు వంద శాతం లక్ష్యంగా పనిచేయాలి. రెండు నెల్లో నగరంలోని ప్రతి ఇంటి తలుపు తట్టి, చెత్తను సేకరించాలి. ఇందుకోసం మహా నగరంలోని 58 డివిజన్లలో ఉన్న కాలనీలను లెక్కించి రూట్లుగా మార్చాలి. క్షేత్రస్థాయిలోను తడి, పొడి చెత్తలను వేరు చేయాలి.

swachcha sarvekshan warangal target 5th

ప్రణాళిక ఇలా :

మహా నగరంలో 1.73 లక్షల ఇళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. 58 డివిజన్లలో ఉన్న కాలనీలను 685 రూట్లుగా ఖరారు చేశారు. ఒక రూటులో ఏడుగురు శానిటేషన్‌ కార్మికులు ఉంటారు. ఇద్దరు కార్మికులు రోజూ 200 ఇళ్లు, 250 కుటుంబాల నుంచి తడి, పొడి చెత్తను సేకరించాలి. మరో ఇద్దరు మురుగు కాలువలు తీయాలి. ఇంకా ఇద్దరు రోడ్లను ఊడ్చాలి. ఇలా కార్యాచరణ రూపొందించినప్పికీ క్షేత్రస్థాయిలో అమలర కావడం లేదు.

పనీతీరు ఇలా :

మహ నగరంలో 1.79 లక్షల ఇళ్లుఉంటే కేవలం 75 వేల ఇళ్లలో మాత్రమే చెత్త సేకరణ జరుగుతోంది. సైకిల్‌ రిక్షాల కొరతతో అన్ని గృాలను వెళ్లలేకపోతున్నట్లు చెబుతున్నారు.

10 కంఫాక్టర్‌ వాహనాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నడుస్తున్న భారీ చెత్త వాహనాలు వరంగల్‌ మహా నగరంలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కొత్తగా 10 కాంఫాక్టర్‌ వాహనాలు ఇచ్చేందుకు టంగీకరించారు. ఈ వాహనాలు వారం, పది రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కంఫాక్టర్‌ వాహనం ఒక ిప్పులో 8 టన్నుల చెత్తను తీసుకెళ్తుంది. ఇలా పది వాహనాలు ఒకేసారి 80 టన్నుల చెత్తను తరలించే సామర్థ్యం ఉంటుంది. కాజీపేట, హన్మకొండ, వరంగల్‌ త్రినగరాల్లో మినీ చెత్త ప్రాసెసింగ్‌ యార్డుల్లో వీరిని అందుబాటులో ఉంచుతారు.

రహదారుల్లో 100 డంపర్‌ బిన్లు

త్రినగరంలో ప్రధాన రహదారుల, కీలకమైన కూడళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో ఇష్టానుసారంగా చెత్తను పడేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి కొత్తగా 100 డంపర్‌బిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఎక్కడైతే చెత్త ఎక్కువగా వెలువడుతుందో అలాిం ప్రదేశాల దగ్గర కొత్తగా డంపర్‌బిన్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం 269 కంఫాక్టర్‌ బిన్లు 58 డంపర్‌ బిన్లు వాడుతున్నారు.

English summary
swachcha sarvekshan warangal target 5th place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X