హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రమొచ్చినా ఇంతేనా, దోపిడీ, నేతల ప్రవర్తన మారలేదు: రంగంలో స్వర్ణలత

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చినా తన గురించి ఆలోచించడం లేదని, ప్రజలు సంతోషంగా ఉండాలని, కొత్త రాష్ట్రం వచ్చినా కొందరు నేతలు ప్రవర్తన మార్చుకోలేదని, ఎవరికి వారు దోచుకుంటున్నారని అయినప్పటికీ అలాంటి వారిని రక్షిస్తున్నారని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు.

బోనాల పండుగ సందర్భంగా సోమవారం నాడు రెండో రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయంలో రంగం నిర్వహించారు. బ్రహ్మచారిణి స్వర్ణలత వచ్చి కుండపై నిల్చుని భవిష్య వాణిని వినిపించారు. ప్రజలందరి సుఖసంతోషాలు చూసే బాధ్యత తనదే అని చెప్పారు.

తన దగ్గరకు వచ్చే భక్తులను తాను తప్పకుండా కాపాడుతానని చెప్పారు. ఎవరికి వారు ఎంత దొరికితే అంత దోచుకోవాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఎవరు ఎంత దోచుకున్నా శిక్షించేది తానే అని, రక్షించేది తానే అని చెప్పారు. రాష్ట్రం వచ్చినా తన గురించి ఆలోచించడం లేదన్నారు.

Swarnalatha Bhavishyavani at Rangam

భక్తులు తనకు పూజలు చేస్తున్నారని చెప్పారు. దోపిడీ చేసే వారికి శిక్ష తప్పదన్నారు. ఆలయ అభివృద్ధి జరగడం లేదన్నారు. తాను కళ్లు మూసుకుని చూసీ చూడనట్టు జీవిస్తున్నానని గతంలో పావలా, అర్థ రూపాయి కానుకలు వచ్చినా, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అమ్మ పలికింది.

రాబడి పెరుగుతూ ఉంటే ఎవరికి వారు దోచుకుందామని చూస్తున్నారన్నారు. కాసులను కాజేయాలని చూస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. కాసులు గొప్పగా రాబట్టే ఆలయం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అమ్మకు మరిన్ని సేవలు జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ధర్మకర్తలు చెప్పారు.

నేతలు, ఆలయ సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారిని శాంతింపజేసేందుకు ఆలయ పూజారులు కల్పించుకున్నారు. ఎందరు అధికారులు, సిబ్బంది, పోలీసులు ఉన్నా, తన భక్తులు తన వద్దకు రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనకు ఏ రకమైన సేవలూ సంతృప్తికరంగా జరగడం లేదని, వర్షాలు పడకపోవడానికి అదే కారణమన్నారు.

దీంతో ఆలయ ప్రధాన పూజారి స్పందించి... అమ్మవారికి జరుపుతున్న సేవలు, కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు ఎంతో భక్తితో సేవలు చేశారన్నారు. ప్రజలను కాపాడాల్సిన తల్లివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? అన్నారు. దానికి అమ్మ.. రక్షించేది, శిక్షించేది తానే అన్నారు.

దుష్టులు ప్రవర్తన మార్చుకోవాలని, ప్రజల్లో చెడు ఆలోచనలు పెరిగాయన్నారు. అయినా తను శాంతితో ఉన్నానంటే, భక్తులే కారణమని, భక్తుల కష్టసుఖాలు తనకు తెలుసునని, ఆశీర్వదించాల్సింది, పెట్టేది, తిట్టేది, శిక్షించేది తానేనన్నారు. వర్షాలు పడాలంటే దైవ పూజలు చేయాలని, ఈ సంవత్సరం పూజలు సరిగ్గా జరగలేదన్నారు.

English summary
Swarnalatha Bhavishyavani in Rangam at Ujjaini Mahankali Temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X